Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

టీడీపీ ఎంపీలకు అండగా నిలిచిన సోనియా గాంధీ

అధికారంలో ఉన్నసమయంలో తాము చేసిన తప్పును కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఇప్పటికి తెలుసుకున్నట్టున్నారు. ఫలితంగానే బడ్జెట్ కేటాయింపుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై టీడీప

టీడీపీ ఎంపీలకు అండగా నిలిచిన సోనియా గాంధీ
, గురువారం, 8 ఫిబ్రవరి 2018 (18:20 IST)
అధికారంలో ఉన్నసమయంలో తాము చేసిన తప్పును కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఇప్పటికి తెలుసుకున్నట్టున్నారు. ఫలితంగానే బడ్జెట్ కేటాయింపుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై టీడీపీ ఎంపీలు పార్లమెంటే వేదికగా గళం విప్పి, ఆందోళన చేస్తున్నారు. అయితే, లోక్‌సభలో గురువారం ఊహించని పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఇందులోభాగంగా, టీడీపీ ఎంపీలతో కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ మంతనాలు జరపడం అందరినీ ఆకట్టుకుంది. 
 
గత నాలుగు రోజులుగా ఏపీ ఎంపీలు పార్లమెంటులో ఆందోళనలు నిర్వహిస్తున్నా, ఏమాత్రం స్పందించని కాంగ్రెస్ పార్టీ... నేడు రూటు మార్చింది. ఏపీకి మద్దతిస్తూ అనూహ్య నిర్ణయం తీసుకుంది. ఏపీ విభజన చట్టం, హోదాపై చర్చ జరపాలంటూ లోక్‌సభలో కాంగ్రెస్ పార్టీ నోటీసును ఇచ్చింది. 
 
రూల్ 184 కింద ఏపీకి ప్రత్యేక హోదాపై చర్చతో పాటు ఓటింగ్ జరపాలంటూ లోక్‌సభ సెక్రటరీ జనరల్‌కు కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ మల్లికార్జున ఖర్గే నోటీసులు అందించారు. టీడీపీ ఎంపీలతో మంతనాల సందర్భంగా ఏపీ కోసం పోరాడతామని సోనియా హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం కాంగ్రెస్ పార్టీ నోటీసులు ఇవ్వడం గమనార్హం. 
 
మరోవైపు, పోలవరానికి నిధులు, విశాఖపట్నం రైల్వే జోన్‌ల విషయంలో న్యాయం చేయాలని, ఏపీకి ప్రత్యేకంగా నిధులు కేటాయించాలని టీడీపీ నేతలు  చేస్తున్న డిమాండ్‌కు కేంద్రం తలొగ్గినట్టు తెలుస్తోంది. దీంతో కొద్దిసేపటి క్రితం కేంద్ర ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టుకు నిధులు విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. పోలరవం ప్రాజెక్టుకు ప్రస్తుతానికి రూ.417.44 కోట్లు విడుదల చేస్తున్నట్లు పేర్కొంది. ఈ నిధులను గ్రాంట్ ఇన్ ఎయిడ్ కింద్ విడుదల చేస్తున్నట్టు కేంద్ర జలవనరుల మంత్విత్ర శాఖ అధికారులు తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పార్లమెంటులో కె. కవిత 'జై ఆంధ్ర'... పవన్ కళ్యాణ్ 'తెలంగాణ'