నేడు 36 ఉపగ్రహాలను మోసుకెళ్లే భారీ రాకెట్ ఎల్‌వీఎం-3 రాకెట్ ప్రయోగం

Webdunia
ఆదివారం, 26 మార్చి 2023 (09:00 IST)
తిరుపతి జిల్లాలోని శ్రీహరికోటలోని భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో)కు చెందిన సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి 36 ఉపగ్రహాలను నింగిలోకి పంపనున్నారు. అంరిక్షంలోకి మోసుకెళ్లే 36 ఉపగ్రహాలను మోసుకువెళ్లే భారీ రాకెట్ ఎల్‌వీఎం - ఎం-3ని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) ఆదివారం ప్రయోగించనుంది. ఉదయం 9 గంటలకు తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని షార్ రెండో ప్రయోగవేదిక నుంచి దీన్ని ప్రయోగించనున్నారు. 
 
నింగిలోకి పంపించే ఉపగ్రహాల్లో యూకేకి చెందిన 5805 కిలోల బరువైన 36 కమ్యూనికేషన్ ఉపగ్రహాలతో సిద్ధమైన రాకెట్ కౌంట్‌డౌ‌న్ శనివారం ఉదయం 8:30 గంటలకు ప్రారంభమైంది. 24:30 గంటలు నిరాటకంగా కౌంట్‌డౌన్ కొనసాగిన అనంతరం రాకెట్ నింగిలోకి దూసుకుపోనుంది. ఇస్రో ఛైర్మన్ డాక్టర్ ఎస్.సోమనాథ్ షార్‌ కేంద్రానికి చేరుకుని ప్రయోగ ఏర్పాట్లను పరిశీలించారు. ప్రయోగ వేదికపై ఉన్న రాకెట్‌ను షార్ డైరెక్టర్ ఆర్ముగం రాజరాజన్, శాస్త్రవేత్తలతో కలిసి సందర్శించారు. 
 
రాకెట్ విజయం కోసం ఇస్రో ఛైర్మన్ సూళ్లూరుపేటలోని చెంగాళమ్మ వారికి పూజలు చేశారు. ఇస్రో న్యూ స్పేస్ ఇండియాతో కుదుర్చుకొన్న వాణిజ్య ఒప్పందంలో భాగంగా ఈ ప్రయోగాన్ని చేపడుతోంది. మన శాస్త్రవేత్తలతో పాటు విదేశీ శాస్త్రవేత్తలు షార్‌కు చేరుకున్నారు. ఇప్పటివరకు ఇస్రో ఈ తరహా ప్రయోగాలు 5 చేపట్టగా అన్నీ విజయాలందించాయి. ఇది ఆరో ప్రయోగం. ఇది కూడా సక్సెస్ అవుతుందని శాస్త్రవేత్తలు గట్టి విశ్వాసంతో ఉన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Japan Earthquake: డార్లింగ్ ప్రభాస్ ఎక్కడ..? మారుతి ఏమన్నారు?

Bigg Boss Telugu 9: బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 గ్రాండ్ ఫినాలే.. ఎలిమినేట్ అయ్యేది ఎవరు?

షూటింగులో ప్రమాదం... హీరో రాజశేఖర్‌ కాలికి గాయాలు

Tarun Bhaskar: రీమేక్ అయినా ఓం శాంతి శాంతి శాంతిః సినిమాని లవ్ చేస్తారు : తరుణ్ భాస్కర్

ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్.. ఏం కష్టమొచ్చిందో?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సులభంగా శరీర బరువును తగ్గించే మార్గాలు

winter health, శీతాకాలంలో ఉసిరి కాయలు ఎందుకు తినాలి?

Black Salt: నల్ల ఉప్పును తీసుకుంటే మహిళలకు ఏంటి లాభం?

61 ఏళ్ల రోగికి అరుదైన అకలేషియా కార్డియాకు POEM ప్రక్రియతో కొత్త జీవితం

ఎముక బలం కోసం రాగిజావ

తర్వాతి కథనం
Show comments