కోటక్ మహీంద్రా బ్యాంక్ లిమిటెడ్, ఇండియన్ ఆయిల్ నేడిక్కడ అత్యంతగా రివార్డులను అందించే, కో-బ్రాండెడ్ ఇంధన క్రెడిట్ కార్డ్‌ను ఆవిష్కరించాయి. ఇండియన్ ఆయిల్ కోటక్ క్రెడిట్ కార్డ్ రూపే నెట్‌వర్క్‌లో అందుబాటులో ఉంది. దేశంలోని 34,000 ఇంధన స్టేషన్ల నెట్‌వర్క్‌తో ఇండియన్ ఆయిల్ అతిపెద్ద చమురు మార్కెటింగ్ కంపెనీ. ఇండియన్ ఆయిల్ కోటక్ క్రెడిట్ కార్డ్ కస్టమర్‌లు దేశంలోని ఏదైనా ఇండియన్ ఆయిల్ ఇంధన స్టేషన్‌లో ఇంధనం కొనుగోలు చేయడం ద్వారా రివార్డ్ పాయింట్‌లను పొందవచ్చు. ఇండియన్ ఆయిల్ ఫ్యూయల్ స్టేషన్లలో ఉచిత ఇంధనాన్ని పొందడానికి ఈ రివార్డ్ పాయింట్లను రీడీమ్ చేసుకోవచ్చు.
నగరంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో, కోటక్ మహీంద్రా బ్యాంక్ లిమిటెడ్, కన్స్యూమర్ అసెట్స్ ప్రెసిడెంట్, శ్రీ అంబుజ్ చందనా; కోటక్ మహీంద్రా బ్యాంక్ లిమిటెడ్ బిజినెస్ హెడ్- క్రెడిట్ కార్డ్స్, శ్రీ ఫ్రెడరిక్ డిసౌజా; ఇండియన్ ఆయిల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (రిటైల్ సేల్స్- నార్త్&ఈస్ట్) శ్రీ విజ్ఞాన్ కుమార్, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ శ్రీ ప్రవీణా రాయ్ ఈ కార్డ్‌ని ఆవిష్కరించారు.
ఇండియన్ ఆయిల్ కోటక్ క్రెడిట్ కార్డ్ ముఖ్య విశిష్టతలు:
ఇండియన్ ఆయిల్ ఇంధన స్టేషన్లలో ఇంధనం కొనడంపై రివార్డ్ పాయింట్లుగా 4% తిరిగి పొందండి- నెలకు రూ. 300 వరకు.
డైనింగ్, కిరాణా, ఇతర చెల్లింపులపై రివార్డ్ పాయింట్లుగా 2% తిరిగి పొందండి- నెలకు రూ. 200 వరకు
1% ఇంధన సర్‌ఛార్జ్ మాఫీని పొందండి- నెలకు రూ. 100 వరకు
48 రోజుల వరకు వడ్డీ రహిత క్రెడిట్ వ్యవధి
స్మార్ట్-ఈఎంఐ
కార్డ్ కోల్పోయిన పక్షంలో జీరో లయబిలిటీ
కాంటాక్ట్‌లెస్ కార్డ్- ట్యాప్ అండ్ పే
“మా ఉత్పాదనల శ్రేణిలో ఇంధనాలకు సంబంధించింది కూడా కలిగి ఉన్నందుకు మేం చాలా సంతోషిస్తున్నాం. కస్టమర్‌లు తమ కొనుగోళ్లన్నింటినీ ఈ కార్డ్ ద్వారా చేసేందుకు ప్రోత్సహించేలా ఈ ఉత్పాదన రూపొందించబడింది. ఇండియన్ ఆయిల్ యొక్క బలమైన బ్రాండ్, పంపిణీ నెట్‌వర్క్ ఈ భాగస్వామ్యానికి గొప్ప బలం. వినియోగదారులకు వినూత్న చెల్లింపు పరిష్కారాలను విస్తరించడంలో, డిజిటల్ చెల్లింపులను విస్తృతంగా స్వీకరించడంలో రూపే ప్లాట్‌ఫామ్ మాకు సహాయం చేస్తుంది" అని కోటక్ మహీంద్రా బ్యాంక్ లిమిటెడ్ క్రెడిట్ కార్డ్స్ బిజినెస్ హెడ్ ఫ్రెడరిక్ డిసౌజా అన్నారు.
ఈ విధంగా కలసి పని చేయడం గురించి ఇండియన్ ఆయిల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (రిటైల్ సేల్స్- నార్త్ & ఈస్ట్), మిస్టర్ విజ్ఞాన్ కుమార్ మాట్లాడుతూ, “ఇండియన్ ఆయిల్ మన గౌరవనీయ ప్రధాన మంత్రి ఆశించిన విధంగా డిజిటల్ ఇండియాకు కట్టుబడి ఉంది. ఈ భాగస్వామ్యంతో ఇండియన్ ఆయిల్ ఇంధన స్టేషన్లన్నింటిలో డిజిటల్ ఇంటరాక్షన్స్‌ను నిర్ధారించే దిశగా మరో నిర్దిష్ట అడుగు వేస్తున్నాం. మా కస్టమర్ విలువ ప్రతిపాదనలు మరియు అనుభవాలను మెరుగుపరచడం అనేది ఎల్లప్పుడూ ఇండియన్ ఆయిల్‌లో మాకు ప్రాధాన్య అంశంగా ఉంటుంది. కోటక్ మహీంద్రాతో ఈ సహకారం మా కస్టమర్‌లకు తిరుగులేని, మెరుగుపరచబడిన ఆఫర్‌ల సమూహానికి సరైన జోడింపు అని నేను విశ్వసిస్తున్నాను. భారత ప్రభుత్వ ఆత్మనిర్భర్ భారత్ ఆశ యాన్ని బలోపేతం చేస్తూ ఇండియన్ ఆయిల్ కోటక్ క్రెడిట్ కార్డ్ ప్రత్యేకంగా రూపే ప్లాట్‌ఫామ్‌లో ప్రారంభించ బడుతుందని తెలియజేసేందుకు కూడా నేను సంతోషిస్తున్నాను అని అన్నారు.