Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కన్స్యూమర్‌ డ్యూరబల్‌ ఉత్పత్తులను విడుదల చేసిన అర్జూ

Advertiesment
image
, శుక్రవారం, 10 మార్చి 2023 (23:03 IST)
భారతదేశంలో అగ్రగామి కన్స్యూమర్‌ డ్యూరబల్‌ మార్కెట్‌ ప్రాంగణం, అర్జూ ఇప్పుడు స్మార్ట్‌ శ్రేణి గృహోపకరణాల నిర్మాణంపై దృష్టిసారించి కన్స్యూమర్‌ డ్యూరబల్స్‌ విభాగంలో ప్రవేశించింది. ఈ భావితరపు ఉత్పత్తులు నూతన తరపు సాంకేతికతలు, అత్యున్నత నాణ్యత, డిజైన్లతో తీర్చిదిద్దబడ్డాయి. అర్జూ ఇప్పుడు ఎలక్ట్రానిక్స్ తయారీలో సుప్రసిద్ధమైన డిక్జాన్‌, అంబర్‌ సహా పలు గ్రూప్‌లతో భాగస్వామ్యం చేసుకుంది.
 
ఈ సందర్భంగా అర్జూ సీఈఓ, కో-ఫౌండర్‌ ఖుష్నుద్‌ ఖాన్‌ మాట్లాడుతూ, ‘‘కన్స్యూమర్‌ డ్యూరబల్‌ విభాగంలో రెండంకెల వృద్ధి కనిపిస్తుంది. అయితే ఈ వృద్ధికి అవరోధంగా నాణ్యత, ధరలు నిలుస్తున్నాయి. మా ఉత్పత్తులు ఈ సమస్యలకు తగిన పరిష్కారం అందించనున్నాయని ఆశిస్తున్నాము. అగ్రగామి తయారీదారులు అయిన డిగ్జాన్‌, అంబర్‌ గ్రూప్‌ వంటి వాటితో భాగస్వామ్యం చేసుకోవడం పట్ల సంతోషంగా ఉన్నాము. ఈ వ్యూహాత్మక భాగస్వామ్యం అత్యున్నత శ్రేణి ఉత్పత్తులు మార్కెట్‌కు తీసుకువచ్చాము’’ అని అన్నారు.
 
డిగ్జాన్‌ టెక్నాలజీస్‌(ఇండియా) లిమిటెడ్‌ వైస్‌ ఛైర్మన్‌- మేనేజింగ్‌ డైరెక్టర్‌ అతుల్‌ బీ లాల్‌ మాట్లాడుతూ, ‘‘అర్జూ గ్రూప్‌తో భాగస్వామ్యం చేసుకోవడం పట్ల మేము చాలా సంతోషంగా ఉన్నాము. ఇది మా విప్లవాత్మక సాంకేతికత, ఓడీఎం నైపుణ్యంను వినియోగదారులకు చేరువ చేస్తుంది. తయారీలో మా నైపుణ్యం, అర్జూ పంపిణీ సామర్ధ్యాలు విజయం చేకూరుస్తాయని ఆశిస్తున్నాము’’ అని అన్నారు. అంబర్‌ గ్రూప్‌  మేనేజింగ్‌ డైరెక్టర్‌ దల్జీత్‌ సింగ్‌ మాట్లాడుతూ, కన్స్యూమర్‌ డ్యూరబల్‌ పరిశ్రమలో అగ్రగామి సంస్థగా అర్జూకు సేవలనందించనుండటం పట్ల సంతోషంగా ఉన్నామన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఓయో రూమ్స్ ఫౌండర్ రితేష్ తండ్రి మృతి.. కుమారుడి పెళ్లిని కళ్లారా చూసి?