Webdunia - Bharat's app for daily news and videos

Install App

పీఎస్ఎల్వీ సీ-48 ప్రయోగం సక్సెస్... ఐదేళ్లపాటు సేవలు

Webdunia
బుధవారం, 11 డిశెంబరు 2019 (15:51 IST)
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో తన ఖాతాలో మరో విజయాన్ని వేసుకుంది. నెల్లూరు జిల్లా శ్రీహరికోటలో ఉన్న షార్ సెంటర్ నుంచి పీఎస్ఎల్వీ సీ-48 రాకెట్ ప్రయోగాన్ని విజయవంతంగా పూర్తిచేసింది. స్వదేశీ ఉపగ్రహం రీశాట్-2తో పాటు.. విదేశాలకు చెందిన మొత్తం 9 ఉపగ్రహాలను నింగిలోకి ప్రవేశపెట్టారు. రీశాట్-2 628 కేజీలుగా ఉంది. అలాగే, అమెరికాకు చెందిన ఆరు శాటిలైట్స్, ఇజ్రాయెల్‌, ఇటలీ, జపాన్‌కు చెందిన ఒక్కో ఉపగ్రహాన్ని పీఎస్ఎల్వీ సీ48 నింగిలోకి మోసుకెళ్లింది. 
 
సతీశ్‌ ధావన్‌ అంతరిక్ష ప్రయోగ కేంద్రం (షార్‌) నుంచి పీఎస్‌ఎల్వీ సీ-48 ద్వారా రాడార్‌ ఇమేజింగ్‌ ఎర్త్‌ అబ్జర్వేషన్‌ శాటిలైట్‌ ‘రీశాట్‌-2బీఆర్‌1’ ప్రయోగాన్ని నిర్వహించారు. శ్రీహరికోట నుంచి 75వ ప్రయోగం కాగా, పీఎస్ఎల్వీ సిరీస్‌లో ఇది 50వది కావడం మరో విశేషం. 
 
మంగళవారం సాయంత్రం 4.40కు మొదలైన కౌంట్‌డౌన్‌ బుధవారం మధ్యాహ్నం 3:25 గంటల వరకు కొనసాగింది. 628 కిలోల బరువున్న రిశాట్‌-2బీఆర్‌1 ఉపగ్రహం.. వ్యవసాయం, అటవీ, విపత్తు నిర్వహణ వంటి రంగాల్లో ఉపయోగపడనుంది. ఐదేళ్ళపాటు ఇది సేవలు అందించనుంది. గత మే 22న ప్రయోగించిన రిశాట్‌-2బీకి కొనసాగింపుగా దీన్ని ప్రయోగిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఓ హీరో ఇబ్బందికరంగా ప్రవర్తించారు.. : సినీ నటి ఖుష్బూ

డిసెంబర్ నుంచి స్ట్రీమింగ్ కానున్న హరికథ వెబ్ సిరీస్

ఖర్చుపెట్టినా దక్కని ఫలితంతో ఎస్కేప్ అయిన నిర్మాత

ఎస్ఎస్ థమన్ లాంచ్ చేసిన అల్లరి నరేష్, అమృత అయ్యర్ బచ్చల మల్లి మెలోడీ సాంగ్

కన్నప్ప లో మహాదేవ శాస్త్రిగా మోహన్ బాబు లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

ఖాళీ కడుపుతో ఈ 5 పదార్థాలను తినకూడదు, ఏంటవి?

క్యాబేజీతో బిర్యానీ.. పెరుగు పచ్చడితో టేస్ట్ చేస్తే.. అదిరిపోతుంది...

వాయు కాలుష్యంలో హృద్రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

హెల్దీ లివర్ కోసం పాటించాల్సిన చిట్కాలు

తర్వాతి కథనం
Show comments