Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పీఎస్‌ఎల్వీ సీ-47కు కౌంట్‌డౌన్ స్టార్ట్

పీఎస్‌ఎల్వీ సీ-47కు కౌంట్‌డౌన్ స్టార్ట్
, మంగళవారం, 26 నవంబరు 2019 (15:20 IST)
నెల్లూరు జిల్లా శ్రీహరికోటలో ఉన్న షార్ కేంద్రంలో పీఎస్‌ఎల్వీ-సీ47 కౌంట్‌డౌన్‌ ప్రారంభమైంది. పీఎస్‌ఎల్వీ-సీ47 ప్రయోగానికి ఉదయం 7.28 గంటలకు ఇస్రో శాస్త్రవేత్తలు కౌంట్‌డౌన్‌ ప్రక్రియ ప్రారంభించారు. కౌంట్‌డౌన్‌ ప్రక్రియ 26 గంటల పాటు కొనసాగనుంది. బుధవారం ఉదయం 9.28 గంటలకు పీఎస్‌ఎల్వీ-సీ47 రాకెట్‌ నింగిలోకి దూసుకెళ్లనుంది. 14 ఉపగ్రహాలను పీఎస్‌ఎల్వీ-సీ47 వాహకనౌక మోసుకెళ్లనుంది. 
 
కార్టొశాట్‌-3తో పాటు అమెరికాకు చెందిన మరో 13 ఉపగ్రహాలను పీఎస్‌ఎల్వీ-సీ47 వాహకనౌక నిర్దేశిత కక్ష్యలోకి ప్రవేశపెట్టనుంది. కార్టొశాట్‌3 ఉపగ్రహం భూవాతావరణం, విపత్తులను హెచ్చరించనుంది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో ఇస్రో కార్టొశాట్‌-3ని రూపొందించింది. 1,625 కిలో బరువున్న కార్టొశాట్‌-3 జీవితకాలం ఐదేళ్లపాటు సేవలందించనుంది. ఉపగ్రహం తయారీకి ఇస్రో రూ.350 కోట్లు ఖర్చు చేసింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మహారాష్ట్ర: ఏ పార్టీ ఏం ఆశిస్తోంది? గతంలో ఇలాంటి వివాదాల్లో కోర్టు ఏం చెప్పింది?