Webdunia - Bharat's app for daily news and videos

Install App

మేకిన్​ ఇండియాకు పునాదిరాయి వేసిన ఇస్రో

Webdunia
ఆదివారం, 18 ఆగస్టు 2019 (13:01 IST)
ప్రధాని నరేంద్ర మోడీ మేకిన్​ ఇండియా నినాదానికి ఇస్రో పునాదిరాయి వేసింది. 5 పీఎస్​ఎల్​వీ రాకెట్లను తయారు చేసేందుకు మన దేశ కంపెనీలకు ఆహ్వానం పలికింది. ఇస్రో ఛైర్మన్​ కె.శివన్​ ఆ వివరాలను వెల్లడించారు. 
 
'ఇంట్రెస్ట్​ ఉన్న కంపెనీలు బిడ్స్​ వేయాల్సిందిగా (ఎక్స్​ప్రెషన్​ ఆఫ్​ ఇంట్రెస్ట్-ఈవోఐ) కోరాం. విదేశీ కంపెనీలకు ఇందులో చోటు లేదు. ప్రభుత్వం చేపట్టిన మేకిన్​ ఇండియా కార్యక్రమానికి ఇది మరింత బలమిస్తుందని భావిస్తున్నాం' అని అన్నారు. ఒక్కో రాకెట్​ తయారీకి రూ.200 కోట్ల దాకా ఖర్చవుతుందని, బిడ్లు వేసే కంపెనీల్లో ఒక్కదానికి వెయ్యి కోట్ల ఆర్డర్​ దక్కుతుందని విక్రమ్​ సారాభాయ్​ స్పేస్​ సెంటర్​ సీనియర్​ అధికారి ఒకరు చెప్పారు. 
 
ఆర్డర్​ దక్కించుకునే కంపెనీకి టెక్నాలజీ ట్రాన్స్​ఫర్​ బాధ్యతలను ఇస్రో కొత్తగా పెట్టిన న్యూ స్పేస్​ ఇండియా లిమిటెడ్ చూసుకుంటుంది.
 
 హాల్​, ఎల్​అండ్​ టీ కన్సార్టియంగా వస్తే.. 'మన దేశంలో హాల్​, ఎల్​ అండ్​ టీ వంటి కంపెనీలు ఇప్పటికే పీఎస్​ఎల్​వీ రాకెట్​ తయారీలో భాగస్వాములయ్యాయి. జనవరిలో ఆ రెండు కంపెనీలూ ఇస్రోతో ఒప్పందం చేసుకున్నాయి. అవి కన్సార్టియంగా మారి ఈ ప్రాజెక్ట్​ను చేపడతాయని ఆశిస్తున్నా. కన్సార్షియంగా మారిన కంపెనీలే ఈవోఐకి రావాల్సిందిగా ఎన్​ఎస్​ఎల్​ఐ రూల్​ కూడా పెట్టింది. సెప్టెంబరు ఆరో తేదీ నాటికి ఈవోఐలు వస్తాయనుకుంటున్నాం. గోద్రెజ్​, కొన్ని చిన్న కంపెనీలూ ఈవోఐలపై ఆసక్తి చూపిస్తున్నాయి' అని శివన్​ చెప్పారు. 
 
ఒక్కో పీఎస్​ఎల్​వీ లాంచ్​ అయినప్పుడు అందులో 150 చిన్నా పెద్ద కంపెనీలు భాగస్వాములవుతున్నాయన్నారు. పీఎస్​ఎల్​వీ, జీఎస్​ఎల్​వీ రాకెట్లకు సంబంధించి సీఈ-20 క్రయోజెనిక్​ ఇంజన్​‌లను హాల్​ తయారు చేస్తుంటుంది. ఇప్పటిదాకా హాల్​కు 24 సెట్ల పీఎస్​ఎల్​వీ, రెండు సెట్ల జీఎస్​ఎల్​వీ ఆర్డర్లు ఇచ్చామన్నారు. పీఎస్​ఎల్​వీ ఎస్​139 సాలిడ్​ ఇంజన్లను ఎల్​అండ్​ టీ తయారు చేస్తోంది. కాగా, ఇస్రో నిర్ణయం స్వాగతించదగినదని, ఇస్రో కోసం ఉపగ్రహాలు తయారు చేస్తున్న ఆల్ఫా డిజైన్​ అనే కంపెనీ సీఎండీ కల్నల్​ హెచ్​ఎస్​ శంకర్​ అన్నారు. ప్రైవేట్​ కంపెనీలకు మార్కెట్​ను ఓపెన్​ చేయడం మంచిదన్నారు. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments