మాజీ ప్రధానమంత్రి, భారతరత్న దివంగత అటల్ బిహారీ వాజ్‌పేయీ ప్రథమ వర్థంతి వేడుకలను బీజేపీ శ్రేణులు శుక్రవారం దేశ వ్యాప్తంగా జరుపుతున్నారు. అటల్ జీ తొలి వర్థంతిని పురస్కరించుకుని ఆయన సమాధి అటల్ సదైవ్‌కు రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్‌తో పాటు.. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, హోం మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌లతో పాటు పలువురు కేంద్ర మంత్రులు, పార్టీ శ్రేణులు ఘనంగా నివాళులు అర్పించారు.
ఢిల్లీలోని వాజ్‌పేయి స్మారకం అటల్ సదైవ్ వద్దకు చేరుకున్న రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాని మోడీ ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. వాజ్‌పేయి పెంపుడు కుమార్తె నమితా భట్టాచార్యతో పాటు మనవరాలు నిహారిక సైతం శ్రద్ధాంజలి ఘటించారు. నివాళులర్పించిన వారిలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, భాజపా కార్యనిర్వాహక అధ్యక్షుడు జేపీ.నడ్డా తదితరులు ఉన్నారు. అలాగే, ఆయా రాష్ట్రాల్లోని బీజేపీ ప్రధాన కార్యాలయాల్లో బీజేపీ నేతలు, శ్రేణులు నివాళులు అర్పించారు.