Webdunia - Bharat's app for daily news and videos

Install App

విజయవాడలో ఇంటిగ్రేటెడ్‌ బస్‌ టెర్మినల్‌

Webdunia
శుక్రవారం, 9 జులై 2021 (11:09 IST)
విజయవాడలో భారీ ఇంటిగ్రేటెడ్‌ బస్‌ టెర్మినల్‌ బిల్డింగ్‌కు రంగం సిద్ధమైంది. ఆటోనగర్‌లోని ఆర్టీసీ బస్‌ టెర్మినల్‌ను ఇంటిగ్రేటెడ్‌ టెర్మినల్‌గా అభివృద్ధి చేయటానికి అడుగులు పడ్డాయి. విజయవాడలో అతిపెద్ద పండిట్‌ నెహ్రూ బస్‌ స్టేషన్‌ (పీఎన్‌బీఎస్‌) ఉండటంతో నగరంలోని బస్‌ డిపోల మీద ఇప్పటి వరకూ అంతగా దృష్టి సారించలేదు.

ఆటోనగర్‌లో మినహా ఇతర డిపోలకు బస్‌ టెర్మినల్స్‌ లేవు. ఆటోనగర్‌ టెర్మినల్‌ బందరు రోడ్డు వెంబడి ఉంది. ఆర్టీసీ బస్సులకు అత్యంత కనెక్టివిటీ ఉన్న డిపో ఇది. ఈ డిపో, టెర్మినల్‌ మొత్తం రెండెకరాల సువిశాల విస్తీర్ణంలో ఉన్నాయి.

ఈ ప్రాంతంలో ఇంటిగ్రేటెడ్‌ బస్‌ టెర్మినల్‌ బిల్డింగ్‌ను నిర్మిస్తే, కమర్షియల్‌గా కూడా లాభపడవచ్చని ఆర్టీసీ ఉన్నతాధికారులు భావించారు. ప్రస్తుత బస్‌ టెర్మినల్‌ స్థానంలో రెండెకరాల విస్తీర్ణంలో భారీ బహుళ అంతస్థుల సౌధాన్ని నిర్మించాలని ఆర్టీసీ అధికారులు భావిస్తున్నారు.

గ్రౌండ్‌ ఫ్లోర్‌ అంతా బస్‌ టెర్మినల్‌కు, అండర్‌ గ్రౌండ్‌ను డిపోకు ఉపయోగించుకోవాలని భావిస్తున్నారు. ఎన్ని అంతస్థులు నిర్మించాలన్నదానిపై ఇంకా స్పష్టత రాలేదు. హైరైజ్‌ భవనం నిర్మిస్తే భారీగా ఆదాయాన్ని ఆర్జించవచ్చన్నది ఆర్టీసీ ఉన్నతాధికారుల ఆలోచన.

ప్రభుత్వం నుంచి కూడా గ్రీన్‌ సిగ్నల్‌ రావటంతో ఉన్నతాధికారులు దీనికి అనుగుణంగా ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాజేంద్ర ప్రసాద్ గారికి ప్రగాఢ సానుభూతి తెలిపిన పవన్ కళ్యాణ్, ఎన్.టి.ఆర్.

రాజేంద్రప్రసాద్ కూతురు మృతి.. గుండెపోటుతో 38 ఏళ్లకే తిరిగిరాని లోకాలకు...

కొరటాల శివలో మనశ్శాంతి చూస్తున్నా : దేవర సక్సెస్ మీట్ లో ఎన్.టి.ఆర్.

అంతకు మించి మార్టిన్ చిత్రం ఉంటుంది: అర్జున్ సర్జా

ఓటీటీలో 100 మిలియన్ల స్ట్రీమింగ్‌ మినిట్స్ తో దూసుకుపోతున్న డీమాంటే కాలనీ 2

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అల్లం పాలు ఎందుకు తాగాలో తెలుసా

లాస్ ఏంజిల్స్ నూతన కార్యవర్గ సమావేశంలో నిర్ణయాలు

కివీ పండు రసం తాగితే ఏంటి ప్రయోజనం?

బాదం పప్పులోని పోషక విలువలతో మీ నవరాత్రి ఉత్సవాలను సమున్నతం చేసుకోండి

కొలెస్ట్రాల్, అధిక రక్తపోటు తగ్గించే తులసి టీ, ఇంకా ఏమేమి ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments