అంతర్జాతీయ స్థాయి నాణ్యతా ప్రమాణాలతో కూడిన వైద్య సేవలను రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల ప్రజలకు నిరంతరాయంగా అందించేందుకు కానూరులో టాప్‌స్టార్స్ ఆసుపత్రిని నెలకొల్పుతున్నట్లు విద్య, వైద్య, సాఫ్ట్‌వేర్ రంగంలో గడచిన రెండున్నర దశాబ్ధాలుగా అమెరికాలో విశేష అనుభవం గడించిన ఆసుపత్రి ఛైర్మన్ తాతినేని శ్రీనివాస్ వెల్లడించారు. ఈ సందర్భంగా సోమవారం ఆసుపత్రిలో జరిగిన విలేకరుల సమావేశంలో స్వదేశానికి అత్యాధునిక వైద్యాన్ని అందించాలన్న ఆశయంతో ఉన్నట్లు చెప్పారు.
విజయవాడ నగర ప్రజలకు ఆధునిక వైద్యం అందించడం, ఆరోగ్య వైద్య సేవలను సామాన్యుడికి అందుబాటులోకి తీసుకురావాలన్న లక్ష్యంతో ఎంజీరోడ్డులోని కానూరులో అత్యాధునిక సౌకర్యాలతో టాప్‌స్టార్స్ ఆసుపత్రిని నెలకొల్పినట్లు తెలిపారు. వైద్య రంగంలో విశేష అనుభవం కలిగిన వైద్య నిపుణులను గుండె, ఆర్థోపెడిక్, న్యూరో, గ్యాస్ట్రో, అవయవ మార్పిడి, గైనకాలజీ, పలమనాలజీ, పిడియాట్రిక్ వంటి మల్టీ స్పెషాలిటీ వైద్య సేవలను అందిస్తున్నామన్నారు. ఈ నెల 30న బుధవారం నాడు ఆసుపత్రి సేవలు నగర ప్రజలకు అందుబాటులోకి వస్తాయన్నారు.
ఆసుపత్రి సీఈవో డాక్టర్ వి.మురళీకృష్ణ, మెడికల్ డైరెక్టర్ డాక్టర్ సుధాకర్, ప్రముఖ హుద్రోగ నిపుణులు డాక్టర్ అరుణ్‌కుమార్, మూత్రపిండాల వ్యాధి నిపుణులు డాక్టర్ శశిధర్‌లు మాట్లాడుతూ.. ఆసుపత్రిలో ఉన్నఅత్యాధునిక సౌకర్యాలను వివరించారు. నవ్యాంధ్రప్రదేశ్‌లో ఇప్పటివరకు లేని హైబ్రీడ్ క్యాథ్‌ల్యాబ్, అత్యాధునిక వెంటిలేటర్లతో కూడిన ఆరు ఆపరేషన్ థియేటర్లు, విశాలమైన 24 డీలక్స్ రూములతో పాటు అన్ని విభాగాలకు సంబంధించి ఎమెర్జన్సీ వైద్య సేవలు, విదేశీ ప్రమాణాలతో కూడిన నాలుగు ఐసీయూలు, ఓపీడి వైద్య సేవలు ప్రజలకు అందుబాటులోకి తెస్తున్నట్లు పేర్కొన్నారు.
అత్యాధునిక అతి కిష్టమైన వైద్య సమస్యలను నిపుణుల పర్యవేక్షణ, సహకారంతో అందించడం టాప్‌స్టార్ ఆసుపత్రి ప్రత్యేకతగా వివరించారు. రోడ్డు ప్రమాదాలు, ట్రామాకేర్, అత్యవసర సేవలు, న్యూరో మరియు హుద్రోగ సేవలు అందించేందుకు అనుభవజ్ఞులైన వైద్యుల బృందం, నర్సింగ్ స్టాఫ్ నిరంతరాయంగా అందుబాటులో ఉంటారని తెలిపారు. సామాజిక బాధ్యతగా సమజ సేవ చేయాలన్న సంకల్పంతో తమ వైద్య బృందం అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో ఉంటూ వైద్యం అందించేందుకు తమ ఛైర్మన్ ఇక్కడ ఆసుపత్రిని నెలకొల్పడం అభినందనీయం అని నిరంతరం రోగుల ప్రాణ రక్షణకు పాటుపడతామని తెలిపారు.