Webdunia - Bharat's app for daily news and videos

Install App

మౌలిక సదుపాయాలు కల్పించాలి: జగన్ కు నిర్మాతల మండలి లేఖ

Webdunia
బుధవారం, 27 మే 2020 (22:43 IST)
చిత్ర పరిశ్రమకు అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించాలని ఏపీ ముఖ్యమంత్రి జగన్ ను నిర్మాతల మండలి కోరింది. స్టూడియోలు, ల్యాబ్స్ తో పాటు నిర్మాతలు, నటీనటులు, ఇతర పరిశ్రమ వర్గాల ఇళ్ల కోసం స్థలాలను కేటాయించాలని విన్నవించింది.

ఈ మేరకు జగన్ కు నిర్మాతల మండలి ఒక లేఖ రాసింది. జీవో నంబర్ 45 ద్వారా రాష్ట్రంలో షూటింగులు చేసుకోవడానికి ప్రభుత్వ ప్రాంగణాలను ఉచితంగా అందించేందుకు ఆదేశాలిచ్చిన సీఎంకు వారు ధన్యవాదాలు తెలిపారు.

గతంలో అప్పటి ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి స్టూడియోలకు, ల్యాబ్స్ నిర్మించుకోవడానికి స్థలాలను ఉదారంగా కేటాయించారని చెప్పారు. ఆర్టిస్టులు, నిర్మాతలు, ఇతర వర్గాల కోసం ఇళ్ల స్థలాలు కూడా ఇచ్చారని తెలిపారు.

అదే మాదిరి ఏపీలో సినీ పరిశ్రమను అభివృద్ది చేసేందుకు ముఖ్యమంత్రి స్థలాలను కేటాయించాలని విన్నవించారు. ఈ మేరకు జగన్ కు నిర్మాతల మండలి అధ్యక్షుడు సి.కల్యాణ్, కార్యదర్శులు ప్రసన్న కుమార్, వడ్లపట్ల మోహన్ లేఖ రాశారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments