Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇంద్రకీలాద్రిపై నేడు నిజ‌రూప దుర్గాదేవి దర్శనం

Webdunia
బుధవారం, 13 అక్టోబరు 2021 (10:59 IST)
ద‌సరా శ‌ర‌న్న‌వ‌రాత్రుల్లో భాగంగా ఏడ‌వ రోజైన నిజ ఆశ్వ‌యుజ శుద్ధ అష్ట‌మి సంద‌ర్భంగా బుధవారం  ఇంద్ర‌కీలాద్రిపై కొలువైన జ‌గ‌న్మాత క‌న‌క‌దుర్గ‌మ్మ శ్రీదుర్గాదేవిగా ద‌ర్శ‌న‌మిస్తుంది. నిజ‌రూపంలో ఉన్న అమ్మ‌వారిని ద‌ర్శించుకునేందుకు భ‌క్తులు ఇంద్ర‌కీలాద్రిపై బారులు తీరి ఉన్నారు. అమ్మ ద‌య ఉంటే అన్నీ ఉన్ట‌ట్లే అని భ‌క్తితో దుర్గ‌మ్మ‌ను కొలుస్తున్నారు.
 
అష్ట‌మి నాడు దుర్గాదేవిగా భ‌క్తుల‌ను సాక్షాత్కారిస్తుంది జ‌గ‌దంబ‌. దుర్గ‌ముడ‌నే రాక్ష‌సుడిని సంహ‌రించినందున దుర్గ అని పేరొచ్చింది. దుర్గ‌తుల‌ను నివారించే మ‌హాశ‌క్తి స్వ‌రూపంగా భ‌క్తులు దుర్గాదేవిని కొలుస్తారు. ఎరుపు రంగు చీర‌లో త్రిశూలం చేత‌ప‌ట్టి కోటి సూర్య‌ప్ర‌భ‌ల‌తో వెలుగొందే ఈ అమ్మ‌వారిని ఎర్ర‌టి పుష్పాల‌తో పూజిస్తే శ‌త్రు బాధ‌లు న‌శిస్తాయి. ఈ రోజున అమ్మ‌వారికి అత్యంత ప్రీతిపాత్ర‌మైన గారెలు, క‌దంబం (కూర‌గాయ‌లు, అన్నం క‌లిపి వండేది) బెల్లం, పాయ‌సం నైవేద్యంగా స‌మ‌ర్పిస్తారు. ఈ రోజున భ‌క్తులు దుర్గాష్ట‌మిగా కూడా జ‌రుపుకుంటారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Satyadev: మత్స్యకారుల బతుకుపోరాటంగా అరేబియా కడలి ట్రైలర్

Bobby Kolli: డైరెక్టర్ బాబీ కొల్లి KVN ప్రొడక్షన్స్‌తో సినిమా ప్రకటన

దేవరకొండ కోసం నల్లగండ్ల అపర్ణా సినిమాస్‌లో రాజమౌళి ప్రత్యక్షం

Raviteja: రవితేజ మాస్ జాతర విడుదల ఆలస్యమవుతుందా?

మొదటి రోజు గ్రాస్ కలెక్షన్స్ తో విజయ్ దేవరకొండ కింగ్డమ్ రికార్డ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

గుండె ఆరోగ్యానికి లేత చింతకాయ పచ్చడి, ఇంకా ఎన్నో ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments