చంద్రబాబు కంటే జగన్ ఆస్తులు తక్కువా?

ఠాగూర్
శుక్రవారం, 21 మార్చి 2025 (09:55 IST)
దేశంలోని అత్యధిక ఆస్తులు కలిగిన ఎమ్మెల్యేల జాబితాను అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) వెల్లడించింది. ఇందులో దేశంలోనే అత్యంత ధనిక ఎమ్మెల్యేగా మహారాష్ట్రలోని భారతీయ జనతా పార్టీకి చెందిన పరాగ్ షా నిలిచారు. ముంబైలోని ఘాట్కోపర్ తూర్పు నియోజకవర్గం నుంచి ఆయన ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఈయన ఆస్తులు రూ.1,413 కోట్లుగా ఉందని వెల్లడించింది. ఎన్నికల సమయంలో ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్‌‍లో పేర్కొన్న వివరాల మేరకు ఆయన ఆస్తులను లెక్కించారు. 
 
ఆ తర్వాత అత్యంత సంపన్న ఎమ్మెల్యేల జాబితాలో కర్నాటక ఉప ముఖ్యమంత్రి, కాంగ్రెస్ ఎమ్మెల్యే డీకే శివకుమార్ రెండో స్థానంలో ఉన్నారు. ఆయన ఆస్తుల విలువ రూ.1,413 కోట్లుగా ఏడీఆర్ పేర్కొంది. ఇక అత్యంత పేద ఎమ్మెల్యేగా వెస్ట్ బెంగాల్‌కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే నిర్మల్ కుమార్ ధారా నిలిచారు. ఈయన ఆస్తులు కేవలం రూ.1700 మాత్రమే. 
 
ఇకపోతే, ఏపీ ముఖ్యమంత్రిగా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆస్తులు రూ.931గాను, మాజీ ముఖ్యమంత్రి, వైకాపా అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆస్తులు రూ.757 కోట్లుగాను, ఏపీకి చెందిన టీడీపీ ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి పి.నారాయణ ఆస్తులు రూ.824 కోట్లుగా ఉన్నట్టు ఏడీఆర్ నివేదిక పేర్కొంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Preity Zinta: ఆభరణాలు జీవితంలో అమూల్యమైన క్షణాలంటున్న ప్రీతి జి జింటా

Tilak Verma : ఆసియా కప్ హీరో క్రికెటర్ తిలక్ వర్మను సత్కరించిన మెగాస్టార్ చిరంజీవి

K-ర్యాంప్ ట్రైలర్ తో డీజే మిక్స్ యూత్ కు రీచ్ చేస్తున్న కిరణ్ అబ్బవరం

Chiru: మన శంకర వర ప్రసాద్ గారు...మీసాల పిల్ల.. 17 మిలియన్‌+ వ్యూస్ సాధించింది

World Health Summit 2025 : తొలి భారతీయ నటిగా కృతి సనన్ గుర్తింపు!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

మామిడి రసం ఇలా తయారు చేస్తున్నారా? చిన్నారులు ఈ జ్యూస్‌లు తాగితే..? (video)

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

ఫ్యాటీ లివర్ సమస్యను అడ్డుకునే చిట్కాలు

ఇంటి లోపల ఆరోగ్యాన్నిచ్చే మొక్కలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments