ఫోటో కర్టెసి- సోషల్ మీడియా
ఆ అధికారి ఉండేదేమో అద్దె ఇల్లు. కానీ ఇంటి పక్కనే వున్న గోదాములో సంచుల నిండా డబ్బు కట్టలు. అతడి అద్దె ఇల్లును చూస్తే పాపం అధికారి అనుకుంటారు కానీ అతడి గుండెల నిండా అవినీతిని చూసి మాత్రం అంతా షాకవ్వాల్సిందే. బీహారులో బెట్టియా విద్యాశాఖలో డీఈఓగా పనిచేస్తున్న ఆ అధికారి ఇంట్లో అవినీతి అధికారులు చేసిన సోదాల్లో డబ్బులు కట్టలు కట్టలుగా బయటపడ్డాయి.
తొలుత అధికారులు ఇంట్లో సోదాలు చేయగా ఏమీ దొరకలేదు. కానీ బియ్యం మూటలు, ఇసుక మూటల్లా పక్కనే వున్న ఓ గోదాములో కనిపించాయి. అవేంటా అని వాటిని తెరిచి చూడగా అన్నీ నోట్ల కట్టలే. ఇక వాటిని లెక్కించడం తమకు సాధ్యం కాదని క్యాష్ కౌంటింగ్ మిషన్లు తెప్పించారు అధికారులు. ప్రస్తుతం అతడికి సంబంధించి ఇప్పటివరకూ రూ. 1.87 కోట్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడీ వార్త బీహార్ రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది.