Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిత్తూరులో ప్రియుడు మరొకరితో దొంగపెళ్లి, శోభనం ముహూర్తానికి ప్రత్యక్షమైన ప్రేయసి

Webdunia
శనివారం, 21 నవంబరు 2020 (10:29 IST)
తన ప్రియుడు తనను మోసం చేసి మరో యువతిని పెళ్లాడుతున్నాడని తెలుసుకుంది. వెంటనే ఉరుకులు పరుగులు మీద తన ప్రియుడు ఇంటికి చేరుకుంది. ఐతే ఆలోపే పెళ్లయిపోయింది. శోభనానికి ఏర్పాట్లు చేస్తున్నారు. అంతే.. ఆమె పోలీసులను ఆశ్రయించింది.
 
వివరాల్లోకి వెళితే... పెద్దపంజాణి మండలానికి చెందిన ఓ యువతి బెంగళూరులోని ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తోంది. ఆమెకి అదే కంపెనీలో పనిచేసే గంగవరం మండలానికి చెందిన గణేష్ తో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా ప్రేమకు దారితీసింది. ఇద్దరూ గత ఆరేళ్లుగా ప్రేమలో వున్నారు. ఐతే వున్నట్లుండి ప్రియుడు గణేష్ తనకు కరోనా లక్షణాలున్నాయంటూ సొంత ఊరికి వచ్చేసాడు.
 
అలా వచ్చినవాడు ప్రియురాలిని పూర్తిగా దూరం పెట్టేసాడు. ఫోన్ చేస్తే అందుబాటులోకి రావడంలేదు. దీనితో అనుమానం వచ్చిన యువతి అతడి స్నేహితులను కాంటాక్ట్ చేసింది. వారి ద్వారా తన ప్రియుడు మరో యువతిని పెళ్లి చేసుకుంటున్నాడని తెలుసుకుంది. దాంతో ఉన్నఫళంగా ప్రియుడు ఇంటికి వచ్చింది.
 
ఐతే అప్పటికే అతడు మరో యువతి మెడలో తాళి కట్టేసాడు. పెళ్లి మండపంలో ప్రియుడిని నిలదీసింది. దాంతో పెళ్లిపెద్దలు బాధితురాలిపై దౌర్జన్యం చేసి బెదిరించారు. చేసేది లేక ఆమె పోలీసులను ఆశ్రయించింది. ఇంకోవైపు పెళ్లయిన కొత్త జంటకు శోభనం ఏర్పాట్లు చేసారు. కానీ శోభనం జరగాల్సిన రాత్రే పోలీసులు వస్తున్నారని తెలుసుకుని వధూవరులు ఇద్దరూ పరారయ్యారు. పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pradeep: నటుడిగా గేప్ రావడానికి ప్రధాన కారణం అదే : ప్రదీప్ మాచిరాజు

షిర్డీ సాయిబాబా ఆలయాన్ని సందర్శించిన మోహన్ బాబు (video)

Prabhas: రాజా సాబ్ అందుకే ఆలస్యమవుతోందని తేల్చి చెప్పిన డైరెక్టర్ మారుతి

Tamannaah: గాడ్ వర్సెస్ ఈవిల్ ఫైట్ మరో స్థాయిలో ఓదెల 2 వుంటుంది : తమన్నా భాటియా

Pawan Kalyan: సింగపూర్ బయల్దేరిన చిరంజీవి, సురేఖ, పవన్ కళ్యాణ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments