Webdunia - Bharat's app for daily news and videos

Install App

అన్ని ఎమ్మెల్సీ స్థానాలు అధికార వైసీపీ ఖాతాలోనే

Webdunia
బుధవారం, 10 నవంబరు 2021 (18:06 IST)
ఆంధ్రప్రదేశ్ లో శాసనమండలి సభ్యులు పెద్ద సంఖ్యలో పదవులు పొందడం ఖరారు అయ్యింది. ఇప్పుడు ఎన్నికలు జరిగే అన్ని ఎమ్మెల్సీ స్థానాలు అధికార వైసీపీ ఖాతాలోనే పడనున్నాయి. మొత్తం ఈ సారి మండలిలో 14 స్థానాలకు ఎన్నిక జరగాల్సి ఉంది.


ఎమ్మెల్యే కోటా కింద మూడు స్థానాల తో పాటు.. స్థానిక సంస్థల కోటా కింద 11 మంది మండలి సభ్యులను ఎంపిక చేస్తారు. ఇక ఈ 14 ఖాళీల నేపథ్యంలో సీఎం జగన్ సుధీర్ఘంగా ఇప్పటికే కసరత్తు పూర్తి చేసినట్లు తెలిసింది. 14 మంది అభ్యర్థుల జాబితాను ఒకే సారి ప్రకటించాలని జగన్ నిర్ణయం తీసుకున్నారని వైసీపీ నేతలు చెపుతున్నారు.


ఇక జిల్లాల వారీగా కొత్త ఎమ్మెల్సీ ల లిస్ట్ ఇలా ఉంది. కడప జిల్లా నుంచి డీసీ గోవింద రెడ్డి - శ్రీకాకుళం నుంచి పాలవలస విక్రాంత్ - విజయనగరం నుంచి ఇందుకూరు రఘురాజు - విశాఖపట్నం నుంచి వంశీ కృష్ణ శ్రీనివాస్ యాదవ్‌, తూర్పుగోదావరి జిల్లా నుంచి అనంత బాబు - గుంటూరు జిల్లా నుంచి మర్రి రాజశేఖర్, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ఉన్నారు. వీరిలో కడప జిల్లా నుంచి డీసీ గోవింద రెడ్డి తాజా ఎమ్మెల్సీ యే ఆయన పదవి మరోసారి రెన్యువల్ చేయనున్నారు. ఇక గుంటూరు జిల్లా నుంచి సీనియర్ నేత ఉమ్మారెడ్డి కూడా తాజా మాజీ ఎమ్మెల్సీయే. ఆయన పదవి కూడా రెన్యువల్ కానుంది.


ఇక చిత్తూరు నుంచి కుప్పం వైసీపీ ఇన్ చార్జ్ గా భరత్ ను ఎమ్మెల్సీని చేస్తున్నారు. బాబును టార్గెట్ చేసేందుకే ఆయనకు ఎమ్మెల్సీ ఇస్తున్నారు. ఇక కర్నూలు జిల్లా నుంచి ఇషాక్ - ప్రకాశం జిల్లా నుంచి రావి రామనాధం బాబు తో పాటు కృష్ణా జిల్లా నుంచి తలశిల రఘురాం - అనంతపురం జిల్లా నుంచి విశ్వేశ్వర్ రెడ్డి పేర్లు ఖరారై పోయినట్టే చెపుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పుష్ప-2 రికార్డు బద్ధలు: కిసిక్ సాంగ్‌ రిలీజ్.. ఎప్పుడంటే?

2025లో పెళ్లి పీటలెక్కనున్న తమన్నా- విజయ్ వర్మ?

రంగస్థలం.. గేమ్ ఛేంజర్.. సైకిల్ తొక్కుతున్న చెర్రీ.. టీడీపీ క్యాడర్ హ్యాపీ?

డాకు మహారాజ్ యాభై రోజుల్లో మీముందుకు రాబోతుంది

పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు డేట్ ఫిక్స్ చేశారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

ఖాళీ కడుపుతో ఈ 5 పదార్థాలను తినకూడదు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments