Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వైసీపీలో ఎవరెవరికి ఎమ్మెల్సీ పదవులంటే?!

Advertiesment
, బుధవారం, 10 నవంబరు 2021 (17:20 IST)
ఆంధ్రప్రదేశ్ లో శాసనమండలి సభ్యులు పెద్ద సంఖ్యలో పదవులు పొందడం ఖరారు అయ్యింది. ఇప్పుడు ఎన్నికలు జరిగే అన్ని ఎమ్మెల్సీ స్థానాలు అధికార వైసీపీ ఖాతాలోనే పడనున్నాయి.మొత్తం ఈ సారి మండలిలో 14 స్థానాలకు ఎన్నిక జరగాల్సి ఉంది.

ఎమ్మెల్యే కోటా కింద మూడు స్థానాల తో పాటు.. స్థానిక సంస్థల కోటా కింద 11 మంది మండలి సభ్యుల ను ఎంపిక చేస్తారు. ఇక ఈ 14 ఖాళీల నేపథ్యంలో సీఎం జగన్ సుధీర్ఘంగా ఇప్పటికే కసరత్తు పూర్తి చేసినట్లు తెలిసింది. 14 మంది అభ్యర్థుల జాబితాను ఒకే సారి ప్రకటించాలని జగన్ నిర్ణయం తీసుకున్నారని వైసీపీ నేతలు చెపుతున్నారు.
 
ఇక జిల్లాల వారీగా కొత్త ఎమ్మెల్సీ ల లిస్ట్ ఇలా ఉంది. కడప జిల్లా నుంచి డీసీ గోవింద రెడ్డి - శ్రీకాకుళం నుంచి పాలవలస విక్రాంత్ - విజయనగరం నుంచి ఇందుకూరు రఘురాజు - విశాఖపట్నం నుంచి వంశీ కృష్ణ శ్రీనివాస్ యాదవ్‌, తూర్పుగోదావరి జిల్లా నుంచి అనంత బాబు - గుంటూరు జిల్లా నుంచి మర్రి రాజశేఖర్, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ఉన్నారు. వీరిలో కడప జిల్లా నుంచి డీసీ గోవింద రెడ్డి తాజా ఎమ్మెల్సీ యే ఆయన పదవి మరోసారి రెన్యువల్ చేయనున్నారు.

ఇక గుంటూరు జిల్లా నుంచి సీనియర్ నేత ఉమ్మారెడ్డి కూడా తాజా మాజీ ఎమ్మెల్సీ యే .. ఆయన పదవి కూడా రెన్యువల్ కానుంది.
 
ఇక చిత్తూరు నుంచి కుప్పం వైసీపీ ఇన్ చార్జ్ గా భరత్ ను ఎమ్మెల్సీని చేస్తున్నారు. బాబును టార్గెట్ చేసేందుకే ఆయనకు ఎమ్మెల్సీ ఇస్తున్నారు. ఇక క ర్నూలు జిల్లా నుంచి ఇషాక్ - ప్రకాశం జిల్లా నుంచి రావి రామనాధం బాబు తో పాటు కృష్ణా జిల్లా నుంచి తలశిల రఘురాం - అనంతపురం జిల్లా నుంచి విశ్వేశ్వర్ రెడ్డి పేర్లు ఖరారై పోయినట్టే చెపుతున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఏడాదిన్నరలో జమ్మూ ఆలయ నిర్మాణం పూర్తి: టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి