Webdunia - Bharat's app for daily news and videos

Install App

3 రాజధానులు.. ఏపీ రైతుల నిరసన.. జగన్ రెచ్చిపోతున్నారు.. బాబు ఫైర్

Webdunia
సోమవారం, 20 జనవరి 2020 (11:31 IST)
ఏపీకి మూడు రాజధానుల బిల్లుపై కేబినెట్ ఆమోదముద్ర వేసిన నేపథ్యంలో.. అమరావతి రైతులు తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వెలగపూడి రైతులు నల్ల జెండాలు, నల్ల బెలూన్లతో నిరసన తెలియజేశారు.

మందడం రైతులు తమ ఇళ్లపై నల జెండాలు ఎగురవేయడమేకాక, రోడ్డుపైకి వచ్చి నల్ల జెండాలతో నిరసన తెలిపారు. వెలగపూడి రైతులు నల్ల బెలూన్లను గాలిలోకి వదిలారు. ఖసేవ్‌ అమరావతి, సేవ్‌ ఆంధ్రప్రదేశ్‌గ అని నినాదాలు చేయడమేకాక, నినాదాలు రాసిన బోర్డులను గోడకు వేలాడదీశారు. 
 
ఇప్పటికే పోలీసుల ఆంక్షలు, గృహ నిర్భంధాలు ఓ వైపు జరుగుతున్నాయి. ఇంకా అమరావతి జేఏసీ అసెంబ్లీ ముట్టడి పిలుపు నేపథ్యంలో పోలీసులు రాజధాని గ్రామాల్లో మోహరించిన విషయం తెలిసిందే. డ్రోన్ల సాయంతో గ్రామాలపై నిఘా ఉంచి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. దీన్ని నిరసిస్తూ మందడం, వెలగపూడి రైతులు నల్ల జెండాలు, నల్ల బెలూన్లతో నిరసన తెలియజేశారు.
 
అమరావతిలో జరిగే నిరసనలను సీఎం జగన్మోహన్ రెడ్డి అడ్డుకోవడం.. ఐకాసతో పాటు టిడిపి నేతలను హౌస్ అరెస్ట్‌లు చేయడం హేయమైన చర్యని టీడిపి అధినేత చంద్రబాబు మండిపడ్డారు. పోలీసులను అడ్డుపెట్టుకుని జగన్ రెచ్చిపోతున్నారని, ప్రజల్లో ఆందోళనను పెంచుతున్నారని విమర్శించారు. 
 
ప్రస్తుతం అమరావతిలో ఎమర్జెన్సీ సమయంలో ఉన్న నిర్బంధం కన్నా అధికంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, పౌర హక్కులకు భంగం కలుగుతోందని ఆయన ఆరోపించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ అసెంబ్లీలో ప్రభుత్వ చర్యలను అడ్డుకోవాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. గృహ నిర్బంధం చేసిన తమ నేతలను వెంటనే విడిచి పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బద్రీనాథ్‌లో ఐటమ్ గర్ల్‌కు గుడి లేదు.. గాడిద గుడ్డూ లేదు: పూజారులు

కమల్ హాసన్ థగ్ లైఫ్ నుంచి మొదటి సింగిల్ జింగుచా గ్రాండ్ రిలీజ్

హాస్పిటల్ నేపథ్యంలో డియర్ ఉమ రివ్యూ: సుమయ రెడ్డి అదరగొట్టింది..

పుష్ప-2 నుంచి పీలింగ్స్ పాటను అదరగొట్టిన ఆంధ్రా మహిళా (వీడియో)

అర్జున్ S/O వైజయంతి మూవీ రివ్యూ రిపోర్ట్... ఎలా వుందంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

తర్వాతి కథనం
Show comments