ఏపీకి మూడు రాజధానులు-పాలనా రాజధానిగా విశాఖ, శాసన రాజధానిగా అమరావతి (Video)

సోమవారం, 20 జనవరి 2020 (11:10 IST)
పాలనా రాజధానిగా విశాఖపట్నాన్ని, శాసన రాజధానిగా అమరావతిని ప్రకటిస్తున్నట్లు సీఎం జగన్ తెలిపారు. సచివాలయంలో సీఎం జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఏపీ మంత్రివర్గ సమావేశం ముగిసింది. పాలన వికేంద్రీకరణ, అన్ని ప్రాంతాల సమగ్ర అభివృద్ధి బిల్లుపై మంత్రివర్గంలో చర్చ సాగింది. ఈ క్రమంలో హైపవర్ కమిటీ నివేదికను మంత్రివర్గం ఆమోదించింది. 
 
పాలనా రాజధానిగా విశాఖ, శాసన రాజధానిగా అమరావతి బిల్లుకు ఆమోదం లభించింది. ఏపీకి మూడు రాజధానులను నిర్ణయిస్తూ ఆ రాష్ట్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. సోమవారం ఉదయం కేబినెట్ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. హై పవర్ కమిటీ నివేదికను ఆమోదిస్తూ ఏపీ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. దాని ప్రకారం ఏపీకి మూడు రాజధానులు ఉండబోతూ ఉన్నాయి. అలాగే నాలుగు ప్రాంతీయ కమిషనరేట్ల ఏర్పాటుకు కూడా ఏపీ కేబినెట్ నిర్ణయం తీసుకుంది.
 
ఏపీకి శాసన రాజధానిగా అమరావతి, జ్యూడిషియల్ క్యాపిటల్ గా కర్నూలు, పాలనా రాజధానిగా వైజాగ్ లు ఉండబోతూ ఉన్నాయి. ఈ మేరకు కొన్నాళ్ల కిందట ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అసెంబ్లీలో ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. ఆ ప్రకటన మేరకు హై పవర్ కమిటీ ఏర్పాటు అయ్యింది. ఆ కమిటీ తన సుదీర్ఘ నివేదికను ముఖ్యమంత్రికి ఇచ్చింది. దానిపై కేబినెట్లో చర్చింది ఆమోద ముద్ర వేసింది ప్రభుత్వం.
 
ఇక రాజధాని ప్రాంతంలో ప్లాట్లు అభివృద్ధి చేసి రైతులకు ఇవ్వాలని నిర్ణయించింది కేబినెట్. రైతు భరోసా కేంద్రాల ఏర్పాటు, ఏఎంఆర్డీఏ ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం ఇచ్చింది. పులివెందుల అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ ఏర్పాటుకు కూడా కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. 
 
అంతేకాకుండా రాష్ట్రమంతటా మొత్తం 11 వేలకు పైగా భరోసా కేంద్రాల ఏర్పాటుకు ఆమోదముద్ర వేసింది. విశాఖపట్నంకు సచివాలయం, హెచ్‌వోడి కార్యాలయాలు, రాజధాని రైతులకు మెరుగైన ప్యాకేజి, కర్నూలులో హైకోర్టు ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది.
 

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం ముగిసిన ఏపీ కేబినేట్ సమావేశం.. రాజధాని రైతులకు మెరుగైన ప్యాకేజీ