Webdunia - Bharat's app for daily news and videos

Install App

పులి కడుపున పులే పుడుతుంది .. నేను వైఎస్ఆర్ రక్తం.. : వైఎస్ షర్మిల

వరుణ్
శుక్రవారం, 26 జనవరి 2024 (19:18 IST)
పులి కడుపున పులే పుడుతుంది .. నేను YSR రక్తం.. ఎవరు అవునన్నా కాదన్నా నేను వైఎస్ షర్మిలా రెడ్డినే అంటూ ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల స్పష్టం చేశారు. తనపై అధికార వైకాపా నేతలు లేనిపోని విమర్శలు చేయడంపై ఆమె స్పందించారు. "విమర్శ చేయడం నా ఉద్దేశ్యం కానే కాదు. వైఎస్ఆర్ పాలనకు జగన్ అన్నగారి పాలనకు చాలా వ్యత్యాసం ఉందన్నారు.
 
వైఎస్ఆర్‌కి, జగన్ అన్నకు ఆకాశం, భూమికి ఉన్నంత తేడా ఉందన్నారు. వైఎస్ఆర్ జలయజ్ఞంపై ప్రత్యేక దృష్టి పెట్టి ప్రాజెక్టులు జలమయం చేశారు. పోలవరం పనులు 32 శాతం పూర్తి చేశారు. ఆయన మరణం తర్వాత ప్రాజెక్టు పక్కన పడేశారు. ఆ తర్వాత చంద్రబాబు వచ్చినా, జగన్ అన్నగారు వచ్చినా ప్రాజెక్ట్ ముందుకు కదలలేదని ఆరోపించారు. 
 
ఇక ప్రత్యేక హోదాపై బాబు, జగన్ అన్న మాట్లాడింది లేదు. బీజేపీతో దోస్తీ కోసం బాబు, జగన్ అన్న ఆంధ్ర రాష్ట్ర ప్రజలను తాకట్టు పెట్టారు. హోదా గురించి రాగం తీసి, నిరాహార దీక్షలు చేసిన వాళ్ళు ఇప్పుడు బీజేపీకి బానిసలుగా మారారని దుయ్యబట్టారు.
 
హోదా కాదు కదా... కనీసం ప్రత్యేక ప్యాకేజీ కూడా లేదు. రాష్ట్రం అభివృద్ది చెందాలి అంటే వీళ్ళతో కాదు.. రాష్ట్రంలో, కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే రాష్ట్రం బాగుపడుతుంది. పోలవరం పూర్తి చేయాలి అంటే కాంగ్రెస్ రావాలి. కాంగ్రెస్ తోనే అభివృద్ధి సాధ్యమని వైఎస్ షర్మిల అన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఇంటిల్లిపాదినీ నవ్వించే సారంగపాణి జాతకం సిద్ధం : నిర్మాత

Santosh Shobhan: సంతోష్ శోభన్ హీరోగా కపుల్ ఫ్రెండ్లీ షూటింగ్ కంప్లీట్

అల్లరి నరేష్ కొత్త సినిమా పేరు 12A రైల్వే కాలనీ

Anasuya: అనసూయకు కోపం వచ్చింది - దమ్ముంటే వేదికపైకి రండి అంటూ సవాల్

దయగల వ్యక్తి అమీర్ ఖాన్.. అందుకే ప్రేమించాను : గౌరీ స్ప్రత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Banana: మహిళలు రోజూ ఓ అరటి పండు తీసుకుంటే.. అందం మీ సొంతం

అమెరికా తెలుగు సంబరాలు: తెలుగు రాష్ట్రాల సీఎంలకు నాట్స్ ఆహ్వానం

గర్భధారణ సమయంలో ఏయే పదార్థాలు తినకూడదు?

Pomegranate Juice: మహిళలూ.. బరువు స్పీడ్‌గా తగ్గాలంటే.. రోజూ గ్లాసుడు దానిమ్మ రసం తాగండి..

వేసవి వాతావరణంలో తాగవల్సిన పానీయాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments