టీడీపీ తరపున గెలిచి వైకాపాలో చేరిన నలుగురు ఎమ్మెల్యేలకు నోటీసులు

వరుణ్
శుక్రవారం, 26 జనవరి 2024 (17:36 IST)
తెలుగుదేశం పార్టీ తరపున గెలిచి వైకాపా పంచన చేసి నలుగురు టీడీపీ ఎమ్మెల్యేలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ సెక్రటరీ కార్యాలయం నోటీసులు జారీచేసింది. ఈ నోటీసులు పంపించిన వారిలో టీడీపీ ఎమ్మెల్యేలు అయిన వల్లభనేని వంశీ, కరణం బలరాం, మద్దాలి గిరి, వాసుపల్లి గణేశ్‌లు ఉన్నారు. 
 
వీరంతా గత ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీ చేసి, వైకాపా చెంతన చేరారు. ఆ తర్వాత వైకాపా ఎమ్మెల్యేలుగా చెలామణి అయ్యారు. అయితే, ఈ నలుగురు ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని కోరుతూ టీడీపీ విప్ డాక్టర్ డోలా బాలవీరాంజనేయ స్వామి స్పీకర్‌కు లేఖ రాసి, అనర్హులుగా ప్రకటించాలని కోరారు. 
 
ఈ నేపథ్యంలో ఏపీ అసెంబ్లీ స్పీకర్ కార్యాలయం, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అభిప్రాయం కోరింది. పార్టీ నిర్ణయం మేరకు అనర్హత పిటిషన్ ఇచ్చామని, ఆ నలుగురు ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలంటూ చంద్రబాబు సమాధానం ఇచ్చారు. 
 
ఈ క్రమంలో ఈ నలుగురు ఎమ్మెల్యేలకు ఏపీ అసెంబ్లీ కార్యదర్శి శుక్రవారం నోటీసులు జారీచేశారు. ఈ నెల 29వ తేదీ మధ్యాహ్నం విచారణకు హాజరుకావాలని, వారి వివరణ అందజేయాలని ఆ నోటీసుల్లో స్పష్టంచేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sarath Kumar: అప్పటికి ఇప్పటికి నాలో ఎలాంటి మార్పు లేదు: శరత్ కుమార్

Sri Vishnu: ఛార్మినార్, ఇరానీ చాయ్ చుట్టూ సాగే కథతో అమీర్‌ లోగ్ ఫస్ట్ లుక్

Vishwak Sen: వినోదాల విందుకి హామీ ఇచ్చేలా విశ్వక్ సేన్.. ఫంకీ టీజర్

Shivaji : ప్రేమకు నమస్కారం లో మహాదేవ నాయుడుగా శివాజి

ఓటీటీలోకి వచ్చిన మారుతి టీం ప్రొడక్ట్ త్రిబాణధారి బార్బరిక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలిఫోర్నియా బాదంల మంచితనంతో దీపాల పండుగను జరుపుకోండి

ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం: మానసిక సమస్యలు అధిగమించడం ఎలా?

బాదం పాలు తాగుతున్నారా?

ఈ దీపావళికి, ఫ్రెడెరిక్ కాన్‌స్టాంట్ తమ హైలైఫ్ లేడీస్ క్వార్ట్జ్ పండుగ బహుమతులు

బాలబాలికలకు శ్రీకృష్ణుడు చెప్పిన 8 ముఖ్యమైన సందేశాలు

తర్వాతి కథనం
Show comments