నేను సిఎం రెండో భార్యను: తాడేపల్లిలో మహిళ హల్‌చల్

Webdunia
బుధవారం, 13 జనవరి 2021 (16:02 IST)
ఎపి సిఎం రెండో భార్యనంటూ తాడేపల్లిలో ఓ మహిళ హల్‌చల్‌ చేసింది. అడ్డుకోబోయిన స్థానికులపై రాళ్లు రువ్వడమే కాకుండా.. విషయం తెలుసుకుని సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులపైనా ఉరకలేసింది.

ఈ షాకింగ్‌ ఘటన తాడేపల్లిలోని సిఎం క్యాంప్‌ ఆఫీస్‌, సిఎం ఇంటికి అతి సమీపంలో ఉండే మహానాడులో భోగి పర్వదినాన చోటుచేసుకుంది. అయితే ఆమెకు మతిస్థిమితం లేదని తెలియడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు.

తాడేపల్లి పట్టణ పరిధిలోని కృష్ణా నదీతీరం వెంబడి ఉన్న మహానాడులో మతిస్థిమితం లేని మహిళ పండగపూట హల్‌చల్‌ చేసింది. తాను సిఎం రెండో భార్యనంటూ బీభత్సం సృష్టించింది.

ఆమె మానసిక పరిస్థితి బాగోకపోవడంతో స్థానికులు ఆమెను నియంత్రించేందుకు ప్రయత్నించారు. ఆగ్రహించిన ఆమె వారిపై తిరగబడింది. స్థానికులపై రాళ్ల దాడికి ప్రయత్నించింది.

దీంతో స్థానికులు తాడేపల్లి పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మతిస్థిమితం లేని మహిళను అదుపులోకి తీసుకుని వివరాలు సేకరించారు.

చిలకలూరిపేటకు చెందిన ధనలక్ష్మిగా ఆమెను గుర్తించారు. మహానాడుకు చెందిన ఓ వైసిపి కార్యకర్త ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ జరుపుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Aadi Pinishetti: ఆది పినిశెట్టి థ్రిల్లర్ మూవీ డ్రైవ్ రిలీజ్ కు సిద్దం.

Yamini Bhaskar: ఆయన దాదాపు 15 నిమిషాలు నాతో మాట్లాడారు : యామిని భాస్కర్

బ్యాడ్ బాయ్ కార్తీక్ నుంచి నాగ శౌర్య, శ్రీదేవి విజయ్ కుమార్ ఎమోషనల్ సాంగ్

హార్ట్‌ వీక్‌గా ఉన్నవాళ్లు ఈషా సినిమా చూడొద్దు : బన్నీ వాస్‌, వంశీ నందిపాటి

ఏవీఎం శరవణన్ భౌతికకాయానిక నివాళులు.. సూర్య కంటతడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

తర్వాతి కథనం
Show comments