Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

చంద్రబాబుకు ఇంటిపట్టాలతో గుణపాఠం:డిప్యూటీ సీఎం

Advertiesment
చంద్రబాబుకు ఇంటిపట్టాలతో గుణపాఠం:డిప్యూటీ సీఎం
, ఆదివారం, 27 డిశెంబరు 2020 (06:34 IST)
ముఖ్యమంత్రి జగన్ చెప్పారంటే చేసి చూపిస్తారని డిప్యూటీ సీఎం అంజాద్ బాషా అన్నారు. అభివృద్ధిని అడ్డుకుంటున్న చంద్రబాబు నాయుడుకు అర్హతే ప్రామాణికంగా ఇళ్లపట్టాలు అందచేసి  గుణపాఠం చెప్పడం జరిగిందన్నారు.

నారాయణరెడ్డిగారిపల్లె లే అవుట్ లో ఇళ్ల పట్టాలు, వైఎస్ఆర్ జగనన్న కాలనీ నిర్మాణ పనుల ప్రారంభ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం అంజాద్ బాషా, లోకసభ ప్యానెల్ స్పీకర్ ,ఎం పి మిథున్ రెడ్డి, ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి, ఎం ఎల్ సి జకియా ఖానంలు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ప్రారంభ కార్యక్రమాలకు విచ్చేసిన డిప్యూటీ సీఎం, ఎం పి, ప్రభుత్వ చీఫ్ విప్, ఎం ఎల్ సి లకు స్థానిక అధికారులు, నాయకులు పూర్ణ కుంభంతో ఘన స్వాగతం పలికారు.

ఈ సమావేశాలనుద్దేశించి డిప్యూటీ సీఎం అంజాద్ బాషా మాట్లాడుతూ..  జగన్  18 నెలల పాలనలో 90 శాతంకు పైగా హామీలును నెరవేర్చిఆదర్శంగా నిలిచారన్నారు.దేశ చరిత్రలో ఏ ప్రభుత్వం చేయని విధంగా అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతూ జగన్ చసృత్ర5 సృష్టిస్తున్నారన్నారు.రాష్ట్ర వ్యాప్తంగా 30 లక్షలకు పైగా ఇళ్ల స్థలాలు అందచేయడం చారిత్రాత్మకమన్నారు.

కులం, ప్రాంతం, వర్గం బేధాలు లేకుండా అభివృద్దే అజెండాగా జగన్ పాలన సాగుతోందన్నారు. లోకసభ ప్యానెల్ స్పీకర్ , ఎం పి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి మాట్లాడుతూ  జగనన్న పాలన  స్వర్ణయుగంగా సాగుతోందన్నారు. విపత్కర పరిస్థితులలో కూడా రాష్ట్రంలో ఎక్కడా సంక్షేమ పథకాలు ఆపకుండా, సంక్షేమపథకాలు, అభివృద్ధి కార్యక్రమాలును నిరంతరంగా కొనసాగిస్తున్నారన్నారు.

రాయచోటి నియోజక వర్గ అభివృద్ధిపై   సీఎం జగన్ కు ప్రత్యేక అభిమానమన్నారు.చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి నిరంతర కృషి,పట్టుదలతో  నియోజక వర్గాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తూ  ఆదర్శంగా నిలుస్తున్నారన్నారు.ఇళ్ల పట్టాల పంపిణీ ఎప్పుడో ప్రారంభం కావాల్సి ఉండగా ప్రతిపక్ష పార్టీ కుట్రలుపన్నడంతో ఆలస్యం జరిగిందన్నారు. ప్రజల ఆశీస్సులతో ఇళ్ల పట్టాల పంపిణీ దిగ్విజయంగా జరుగుతోందన్నారు.

ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ ఆదర్శ టౌన్ షిప్ గా నారాయణరెడ్డిగారిపల్లె టౌన్ షిప్ ను అభివృద్ధి చేస్తామన్నారు.ఎన్నికల సమయంలో రెండు పేజీల మ్యానిఫెస్టోలోని హామీలును 18 నెలల కాలంలో 90 శాతంకు పైగా హామీలును జగన్  నేరవేర్చారన్నారు.సీఎం జగన్ విద్యారంగంలో సమూల మార్పులు తెచ్చారన్నారు. నాడు నేడు తో ప్రభుత్వ పాఠశాలలును కార్పోరేట్ కు ధీటుగా అభివృద్ధి చేయడం జరుగుతోందన్నారు.

మహిళా సంక్షేమం కోసం నిరంతరం జగన్ శ్రమిస్తున్నారన్నారు.చంద్రబాబు మహిళలును మోసగించారన్నారు. జగన్ చెప్పిన ప్రకారం డ్వాక్రా అక్కచెల్లెమ్మలకు 4 విడతలుగా రుణాలను మాపీ చేస్తామని చెప్పిన ప్రకారం ఇప్పటికే ఒక విడత ఋణమాపీ ని చేశారన్నారు. వై ఎస్ ఆర్ చేయూత క్రింద రూ.18,750 లు అందచేస్తూ మహిళల ఆర్థికాభివృద్ధికి తోడ్పాటు అందిస్తున్నారన్నారు.

దివంగత ముఖ్యమంత్రి వై ఎస్ ఆర్ ఐదేళ్ల పాలన లో  ఆరోగ్యశ్రీ, 108,104 , ఫీజు రీయంబర్స్మెంట్ తదితర ఎన్నో పథకాలును ప్రవేశపెట్టి ప్రజల మనస్సులలో చిరస్థాయిగా నిలిచారన్నారు. 15ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు శాశ్విత పథకాన్ని కానీ, అభివృద్ధి పనులు చేయలేదన్నారు. నారాయణరెడ్డిగారిపల్లె లే అవుట్ ను ఆదర్శంగా అభివృద్ధి చేస్తామన్నారు.

ఇక్కడికి సంబేపల్లె, చిన్నమండెం, రాయచోటి రింగ్ రోడ్డు ప్రాంతాల  నుంచి ఐదు రహదారులను ఏర్పాటు చేస్తామన్నారు.ఇప్పటికే మోటకట్ల నుండి తారురోడ్డు పనులను పూర్తిచేసామన్నారు. ఇళ్లు కట్టుకునే స్తోమత లేనివారికి ప్రభుత్వమే ఇళ్లను నిర్మిస్తుందన్నారు.దివంగత ముఖ్యమంత్రి వై ఎస్ ఆర్ పాలనలో దివంగత మాజీ ఎం ఎల్ ఏ నారాయణ రెడ్డి  హయాంలో 4 ఇందిరమ్మ కాలనీలును ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.

రాయచోటి పట్టణంలో రూ 360 కోట్ల నిధులుతో భూగర్భ డ్రైనేజీ తదితర అభివృద్ధి పనులను త్వరలో ప్రారంభిస్తామన్నారు. నియోజక వర్గ అభివృద్దే ధ్యేయంగా అనునిత్యం పనిచేసి ప్రజాభిమానాన్ని పొందుతానని, ఎప్పటికీ తప్పులు చేయనని శ్రీకాంత్ రెడ్డి ప్రజల కరతాల ధ్వనుల మధ్య తెలిపారు.

ఎం ఎల్ సి జకియా ఖానం మాట్లాడుతూ  పేదలందరికీ  ఇళ్ళు అందించాలన్నదే సీఎం జగన్ లక్ష్యమన్నారు. సీఎం జగన్ సహకారం తో  చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి కృషితో రాయచోటి నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందుతోందన్నారు. జాయింట్ కలెక్టర్  గౌతమి మాట్లాడుతూ  ఇళ్ల పట్టాల పంపిణీని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిందన్నారు.

అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ ఇళ్ల పట్టాలు అందుతాయన్నారు. అర్హత ఉండి పట్టా రానివారికి కూడా పట్టా అందిస్తామన్నారు.జెడ్ పి మాజీ వైస్ చైర్మన్ దేవనాధ రెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు హయాంలో ఒక హౌసింగ్ కాలనీ నిర్మాణం కనపడిందా అని అన్నారు. చీప్ విప్ శ్రీకాంత్ రెడ్డి  ధన్యజీవి గా పేరొందుతారన్నారు. మోడల్ కాలనీగా ఇది అభివృద్ధి చెందుతోందన్నారు.

మాజీ డి సి ఎం ఎస్ చైర్మన్ ఆవుల విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడుతూ ఇళ్ల నిర్మాణాలకు ప్రభుత్వం కల్పిస్తున్న ఈ అవకాశాన్ని  లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.హాబీబుల్లాఖాన్ మాట్లాడుతూ  శ్రీకాంత్ రెడ్డి కృషి తో పట్టణం అభివృద్ధి చెందుతోందన్నారు.

మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ కొలిమి హారూన్ మాట్లాడుతూ పేదల సంక్షేమమే ధ్యేయంగా  జగన్ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. కొలిమి ఛాన్ బాషా మాట్లాడుతూ నూతనంగా ఒక పెద్ద ఊరు ఏర్పడుతుండడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఫయాజుర్ రెహమాన్ మాట్లాడుతూ  గత ప్రభుత్వాలలో ఎటువంటి అభివృద్ధి పనులు జరగలేదన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వైసీపీ ప్రభుత్వ నిర్ణయం పీజీ విద్యార్థుల పాలిట యమపాశం: సయ్యద్ రఫీ