టీడీపీ అధినేత చంద్రబాబు పై మంత్రి కొడాలి నాని మరోమారు తిట్ల దండకం అందుకున్నారు. ఫేక్ గాడు అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మంత్రి కొడాలి నాని ఏమన్నారంటే..?
- అమరావతి ఉద్యమం 365 రోజులు పూర్తైన సందర్భంగా చంద్రబాబు, ఆయన తోకపార్టీలు మీటింగ్ పెట్టాయి. అమరావతిని ఎలా కాపాడాలి. అమరావతిలో రైతులకు ఏవిధమైన న్యాయం చేయాలి? అమరావతిని రాజధానిగా ఉండాలంటే ఏం చేయాలి. ప్రభుత్వానికి సలహాలు ఇస్తారేమో అని చూశానని కొడాలి నాని అన్నారు.
అయితే చంద్రబాబుకు మతిభ్రమించి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారని బీసీ సదస్సులో సీఎం జగన్ చెప్పారు. జగన్ చెప్పిన అరగంటలోనే చంద్రబాబు శాపనార్థాలు పెట్టడానికే వచ్చినట్లు ఇష్టమొచ్చినట్లు వాగారని కొడాలి నాని మండిపడ్డారు.
- టీడీపీది జాతీయ పార్టీగా ఎన్నికల సంఘం ఏమైనా సర్టిఫై చేసిందా? టీడీపీది ఒక ఉప ప్రాంతీయ పార్టీ. నువ్వు ఒక జాతీయ నాయకుడివా? టీడీపీ జాతీయ పార్టీ అని నిరూపిస్తే రాజకీయాల్లోంచి వెళ్లిపోతానని కొడాలి నాని సవాల్ చేశారు. చంద్రబాబు ఒక ఫేక్‌గాడు. టీడీపీ ఒక ఫేక్ పార్టీ. చంద్రబాబు ఒక ఫేక్ అధ్యక్షుడు. బాబు ఒక దొంగ.
టీడీపీ ఫౌండర్ కాదు. ఎన్టీఆర్ దగ్గర కొట్టుకొచ్చినటు వంటి చిల్లర దొంగ అని కొడాలి నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ రోజు అమరావతి శంకుస్థాపన ప్రదేశానికి వెళ్లి బాబు పడుకున్నారు. 1983లో కాంగ్రెస్ పార్టీ టిక్కెట్‌తో పోటీ చేసి ఓడిపోయి ఎన్టీఆర్ కాళ్ల దగ్గర కూడా ఇలాగే (శంకుస్థాపన దగ్గర సాష్టాంగపడిన ఫొటోను చూపిస్తూ) చంద్రబాబు పడుకున్నారు.
- అమరావతి రైతుల్ని కూడా ఫేక్ అమరావతిని పేపర్ మీద సృష్టించి చంద్రబాబు మోసం చేశారు. అమరావతి అంటూ ఫేక్ గ్రాఫిక్స్ రిలీజ్ చేసి 33 వేల ఎకరాలు దోచుకొని రైతుల్ని మోసం చేశారు. రాజధాని ముందే వస్తుందని తెల్సి చంద్రబాబు, కొన్ని వ్యవస్థల్లోని అధిపతులతో కోట్లాను కోట్ల డబ్బులు మిగులుతాయని పెట్టుబడులు పెట్టించి రైతుల్ని నిట్టనిలువునా దోపిడీ చేశారు. ఐదేళ్లు ఫేక్ గ్రాఫిక్స్ రిలీజ్ చేసి రైతులను రోడ్ల మీద పడేసిన గుంట నక్క చంద్రబాబు అని కొడాలి నాని అన్నారు.
- జగన్ పార్టీ పెట్టి ప్రజల దగ్గరకు వెళ్లి ఐదేళ్లు పోరాటాలు చేసి 67 మంది శాసనసభ్యులతో ప్రతిపక్ష నాయకుడయ్యారు. ఆ తర్వాత జగన్ పాదయాత్రతో సీఎం అయ్యారు. సీఎం అయిన తర్వాత ఇచ్చిన ప్రతిమాట నెరవేరుస్తున్నారు. ఈరోజున చంద్రబాబు నోటికి అడ్డుఅదుపూ లేకుండా జగన్ పై పడి ఏడ్వటం ఏంటి? జగన్ మట్టి కొట్టుకుపోతారని చంద్రబాబు అనటంపై కొడాలి నాని ఆగ్రహం వ్యక్తం చేశారు.
- 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉండి ఎప్పుడైనా కనకదుర్గమ్మ నవరాత్రి ఉత్సవాల్లో ఒక్కసారైనా పట్టు వస్త్రాలు సమర్పించారా? ఈరోజు చంద్రబాబు, ఆయన బినామీలు రోడ్డు మీద పడేసరికి కనకదుర్గమ్మ గుర్తుకు వచ్చారు. పైగా గత ప్రభుత్వంలో గుడిలో క్షుద్ర పూజలు చేయించారు. పైన గుడి ఉంటే అవతల గట్టున అక్రమ కట్టడంలో చంద్రబాబు నివాసం ఉన్నారు. చంద్రబాబు చేసిన అక్రమాలు అన్నీ అమ్మవారు చూసారు కాబట్టే 23 సీట్లకు పరిమితం చేశారు.
అంతేకాదు.. దుర్గమ్మ తల్లి చంద్రబాబును ఇంటికి పరిమితం చేసింది. జూమ్ కెమెరా ఒకటి పెట్టి ... రోడ్డున పడేందని కొడాలి నాని అన్నారు. జగన్ ని దుర్గమ్మ తల్లి చల్లగా చూడబట్టే ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. సీఎం హోదాలో అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించి వచ్చారు. దుర్గగుడికి రూ.70 కోట్లు ఎస్టిమేషన్స్ వేస్తే ఐదేళ్లలో ఒక్క రూపాయి చంద్రబాబు ఇవ్వలేదు. జగన్ ముఖ్యమంత్రి అవ్వగానే రూ.70 కోట్లు విడుదల చేసి పనులు ప్రారంభించమని ఆదేశాలు జారీ చేశారు. దుర్గమ్మ ఆశీస్సులు జగన్ కి పుష్కలంగా ఉంటాయని కొడాలి నాని అన్నారు.
- చంద్రబాబు బ్రతుకు ఏమైందో చూస్తున్నాం. గతంలో శ్రీవారికి పట్టువస్త్రాలు తీసుకువెళ్తుంటే అలిపిరి దుర్ఘటన జరిగింది. మళ్లీ ముఖ్యమంత్రి హోదాలో వెళ్లలేదు. పది సంవత్సరాలు ప్రతిపక్షంలోనే చంద్రబాబు ఉన్నారు. వెంకటేశ్వర స్వామి నా కుల దైవం అనటం ఏంటి? నీలాంటి వారివైపు దేవుళ్లు ఎందుకు ఉంటారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు పుష్కరాలు అని దేవుడు గుళ్లు కూల్చినందుకు ఉంటారా? బూట్లు వేసుకొని వెళ్లి గుళ్లలోకి వెళ్లి పూజలు చేసినందుకు ఉంటారా? చంద్రబాబు లాంటి వారిని అంతం చేయటానికే దేవతలు, దేవుళ్లు ఉంటారు.
- రిఫరెండం అని చంద్రబాబు అనటంపై కొడాలి నాని స్పందించారు. ముఖ్యమంత్రి మేమంతా రాజీనామాలు చేయాలంట. ఎన్నికల్లో గెలిస్తే చంద్రబాబు రాజకీయాల నుంచి తప్పుకుంటాడట. జూమ్ యాప్‌లో కూర్చొని రోజుకు ఓ గంట కబుర్లు చెబితే రాజకీయాల్లో ఉన్నట్టా? 23 సీట్లు వచ్చాయ్. రాజకీయాల్లోంచి ఎట్టి పరిస్థితుల్లో చంద్రబాబు తప్పుకోవద్దు. బాబు లాంటి వ్యక్తులు రాజకీయాల్లో ఉంటే ఈసారి జగన్ కి 175 సీట్లు వస్తాయ్.
గతంలో పులివెందులలో జగన్ ని ఓడిస్తామని చంద్రబాబు, ఉమా ప్రగల్భాలు పలికారు. మీరు పలికితే ప్రగల్భాలే. కానీ చంద్రబాబును కుప్పంలో ఓడించి రాజకీయ సమాధి వైయస్ఆర్‌సీపీ కడుతుంది. గతంలో చంద్రబాబును శాసనమండలిలో గ్యాలరీ ఎక్కించారు. నిన్న శానససభలో కింద కూడా కూర్చొబెట్టారు. ఇప్పుడు అమరావతిలో రోడ్డు మీద పడుకోబెట్టారు. బాబుకు ఇంకా చాలా చిత్రాలు చూపించాలి. చంద్రబాబు చేసిన పాపాలు మామూలు పాపాలు కాదు.
- ఎన్టీఆర్ ని 73 ఏళ్ల వయస్సులో క్షోభ పెట్టి చంపావు. రామారావుకి ఏ విధమైన చావు తీసుకువచ్చారో బాబుకు కూడా దేవుడు తగిన శాస్తి చేస్తాడు. అమ్మ ఒడి అని జగన్ ఇస్తూ నాన్న బుడ్డీ అంటూ తీసుకుంటున్నారని అన్నారు. అది నాన్న బుడ్డీ కాదు. చంద్రబాబు బుడ్డీ. 1995లో ఎన్టీఆర్ మద్యపాన నిషేధం పెట్టారు. అక్రమ మద్యం కంట్రోల్ చేయలేకపోతున్నామని నాన్న బుడ్డీ కాదు.. చంద్రం బుడ్డీ తెచ్చారు. ఎన్టీఆర్ మద్యపాన నిషేధం విధిస్తే చంద్రం బుడ్డీ తెచ్చిందెవరు? మద్యం గురించి, బుడ్డీల గురించి మాట్లాడటానికి చంద్రబాబుకు అర్హత లేదు. చంద్రబాబు మాట్లాడితే దరిద్రంగా ఉంటుంది.
- దుశ్శాసనులు, ధుర్యోధనులు అని చంద్రబాబు అంటున్నారు. దుశ్శాసనులు అంటే ఓ ఎమ్మార్వోను చీరను చింతమనేని లాగటం. మా పార్టీలో ఎవ్వరూ ఎవరి చీరను లాగలేదు. టీడీపీ నేతే ఓ దళిత మహిళను కిందపడేసి కొట్టడం చేశారు. విజయవాడలో కాల్ మనీ సెక్స్ రాకెట్‌లో మహిళలను టీడీపీ దుశ్శాసనులు ఏ విధంగా వేధించారో రాష్ట్రంలో మహిళలు అంతా చూశారు. ఎన్నికలప్పుడు పసుపు-కుంకుమ అని చెప్పినా భూమిలో గొయ్యి తీసి రాజకీయ సమాధి చేశారు.
అయినా చంద్రబాబు సిగ్గు, శరం లేకుండా నన్ను ఏం పీకుతారని అనటం ఏంటి? 151 సీట్లు జగన్ కి వస్తే.. 23 సీట్లు చంద్రబాబుకి వచ్చాయ్. పైగా గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఓటేయమని ట్విట్టర్‌లో కోరాడు. గ్రేటర్ ఎన్నికల్లో అభ్యర్థులను పెట్టి బాబు, కొడుకులు ఇంట్లో పడుకోవటం ఏంటి? ఫేక్ పార్టీ తరుపున గ్రేటర్‌లో 1.29% ఓటింగ్ వచ్చింది. హైదరాబాద్ ప్రజలు అండర్ గ్రౌండ్‌లో పెట్టారు. మరి, చంద్రబాబును ఇంకేం పీకుతారు?
- పీకటం అంటే.. ఏంటి.. చంద్రబాబు కొడుకును మంగళగిరిలో ఓడించారు. 1%, 2% ఓట్లు వచ్చినవారు వచ్చి మమ్మల్ని పీకండని అనటం ఏంటని కొడాలి నాని మండిపడ్డారు. జగన్ దళితులకు, బీసీలకు సంక్షేమ కార్యక్రమాలను చక్కగా అందిస్తున్నారు. దీనిపై చంద్రబాబు మాట్లాడటం ఏంటి? రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 50% పదవులు ఇస్తుంటే అదే విషయాన్ని చంద్రబాబు బుర్రలేకుండా మాట్లాడటం ఏంటి?
రాజారెడ్డి రాజ్యాంగం అనటం ఏంటి? అసలు దివంగత రాజారెడ్డి కనీసం వార్డు మెంబర్‌గానూ పనిచేయలేదు. ఆయన పేరు చంద్రబాబు ఎత్తటం ఏంటని కొడాలి ఆగ్రహం వ్యక్తం చేశారు. లేకపోతే చంద్రబాబు ఏమైనా ఖర్జూర నాయుడు రాజ్యాంగం నడిపారా లేక క్రిస్‌మిస్ నాయుడు, లవంగం నాయుడు రాజ్యాంగం నడిపారా అని కొడాలి నాని ఫైర్ అయ్యారు.
- ఎప్పుడు చూసినా లోటస్‌పాండ్, బెంగలూర్ ప్యాలెస్ అంటారు. చంద్రబాబుకు ఏమీ లేవా? హైదరాబాద్‌లో పూరిగుడిసెలో ఉంటున్నారా అని కొడాలి నాని మండిపడ్డారు. ఊరికో హెరిటేజ్ బిల్డింగ్ ఎంతెంతవి కట్టారు. ఈరోజు అమూల్ ప్రాజెక్ట్ తెచ్చి కోఆపరేటివ్ కింద పాలు పోసే రైతులకు ఓనర్ షిప్ ఇచ్చి లీటర్‌కు రూ.4-5లు ఎక్కువ ఇస్తున్నాం. లాభాలు కూడా పాలుపోసే వారికే ఇస్తున్నాం.
రూ.5-6లు తక్కువకు గ్రామీణ ప్రాంతాల్లో పాలు కొన్నది ఎవరు? సంవత్సరానికి రూ.10-15 వేలు గ్రామీణ మహిళల నుంచి హెరిటేజ్ ద్వారా దోచేశారు. హెరిటేజ్‌కు రూ.10-15 వేల కోట్ల ఆస్తులు ఉన్నాయ్. ఒక గేదె ఉన్న మహిళ నుంచి రూ.10వేలు హెరిటేజ్ ద్వారా చంద్రబాబు తినేశారు.
- పాల ఉత్పత్తుల్ని తక్కువకు కొని హోల్‌సేల్‌గా, రిటైల్‌గా హెరిటేజ్ ద్వారా లూటీ చేసిన వ్యక్తి చంద్రబాబే. పైగా సీఎం శ్రీ జగన్ గారు ఏమో రిటైల్ అంట. మంత్రులు, ఎమ్మెల్యేలు హోల్‌సేల్ అనటం ఏంటి? రిటైల్, హోల్‌సేల్ అన్నీ చంద్రబాబే. పిచ్చపిచ్చగా చంద్రబాబు మాట్లాడితే బావుండదు. ఎవరో ఒకరు వచ్చి తిట్టాలని తద్వారా సానుభూతి పొందాలని చంద్రబాబు చూస్తున్నారని కొడాలి నాని అన్నారు.
- కాంగ్రెస్ పార్టీ మీద యుద్ధం ప్రకటించి రోడ్డు మీదకు వచ్చి అంచెలంచెలుగా జగన్ పైకెదిగి సీఎం అయి.. మాలాంటి వారిని ఎమ్మెల్యేలను చేశారు. అంతేకాదు ఈనాడు బీసీ కార్పొరేషన్ ఛైర్మన్లు, డైరెక్టర్లను నియమించారు. మహిళలు ఉద్యమం చేస్తే చంద్రబాబు వచ్చి ఏం పీకుతారు అనటం ఏంటి?
రాజధానిపై దర్యాప్తు జరుగుతుంటే ఆదివారం సాయంత్రం జడ్జి ఇంటికి వెళ్లి గాగ్ ఆర్డర్ తెచ్చుకున్నారు. ఈ కేసు మీద విచారణ జరపవద్దని మందీమార్భలంతో బయటకు వచ్చారని అనుకుంటున్నారు. ఈ స్టేలు త్వరలోనే వెకేట్ అవుతాయి. అప్పుడు ఏం పీకుతారో చేసిన పనులకు తగిన శాస్తి ఈ ప్రభుత్వం చేస్తుందని కొడాలి నాని అన్నారు. చంద్రబాబు లేకపోతే రాజకీయాల్లో ఎంటర్‌టైన్‌మెంట్ ఉండదని నాని అన్నారు.
- ఇంగ్లీషు మీడియం పెట్టవద్దని చంద్రబాబు అన్నారు. తెలుగు మీడియం గురించి ఉద్యమం చేసిన రాధాకృష్ణ పిల్లలు, వెంకయ్య నాయుడు పిల్లలు ఎక్కడ చదివారని అడిగితే కోర్టులకు వెళ్లి ఫైట్ చేశారు. మళ్లీ ఈరోజు నేను ఇంగ్లీషు మీడియాన్ని వ్యతిరేకించలేదని ఆరు నెలల్లో యూటర్న్ తీసుకొని మాట మార్చేయటం ఏంటని చంద్రబాబుపై కొడాలి నాని మండిపడ్డారు. చంద్రబాబు చేసే నక్కజిత్తు విన్యాసాలు, డ్రామాలన్నీ రాష్ట్ర ప్రజలకు తెల్సు. వచ్చే ఎన్నికల్లో కుప్పంలో ఓడించి రాజకీయ సన్యాసం చేసి ఇంటికి సాగనంపుతామని కొడాలి నాని హెచ్చరించారు.
- ఈ రాష్ట్రంలో ఒకే రాజధాని అమరావతి ఉండాలని ప్రజలు కోరుకుంటున్నారని అనుకుంటే టీడీపీ శాసనసభ్యులతో రాజీనామా చేయించి ఎన్నికలకు వెళ్లండని చంద్రబాబుకు కొడాలి నాని సవాల్ చేశారు. మాకు డిపాజిట్‌లు లేకుండా బ్రహ్మాండంగా గెలిస్తే.. తప్పకుండా రాజధాని ఇక్కడే ఉంటుందని కొడాలి నాని అన్నారు. 100రోజుల సినిమా ఫంక్షన్‌లా జూమ్ యాప్‌లో కబుర్లు చెప్పి వెళ్లిపోదాం అని చంద్రబాబు అనుకుంటున్నారేమో అని కొడాలి నాని ఎద్దేవా చేశారు.
- అమరావతిలో 50వేల మంది పేదలకు బలహీనవర్గాలకు పట్టాలు ఇవ్వాలని సీఎం జగన్ అనుకుంటే అమరావతి జేఏసీ కోర్టుకు వెళ్లి ఎందుకు స్టే తెచ్చిందో సమాధానం చెప్పాలని కొడాలి నాని డిమాండ్ చేశారు. పంట పండించుకొంటాం. మా భూములు మాకివ్వండి అనేవాడు రైతు అవుతాడు. మా భూములు మాకొద్దు. మీరు తీసేసుకొని ప్లాట్లు ఇచ్చేయండి. ప్రభుత్వం ప్లాట్లపై ఖర్చు చేయండంటే ప్రజలు ఎందుకు మద్దతు ఇస్తారు. ఉత్తరాంధ్ర, రాయలసీమ వారు వచ్చి మీకు మద్దతు ఇస్తారా? మూడు ప్రాంతాల్లో రాజధాని వికేంద్రీకరణ జరగాల్సిందే. మూడు ప్రాంతాలు అభివృద్ధి చెందాల్సిందేనని కొడాలి నాని అన్నారు.
- కాంగ్రెస్ నాయకుడు ఎవరో గంజాయ్ రెడ్డి అంట. 9వేల ఎకరాలు ప్రభుత్వానికి మిగులుతుంది. 90 వేల కోట్లు అవుతుందట. ప్రభుత్వం లక్షన్నర కోట్లు పెట్టి రోడ్లు నిర్మిస్తే.. మిగిలేది ఎంత అని కొడాలి నాని ప్రశ్నించారు. చంద్రబాబు మాట్లాడేదానికి బుద్ధి ఉందా? చంద్రబాబు కొడుకు కోసం రాష్ట్ర సంపద దోచి పెట్టాలా? ఉత్తరాంధ్రలో బలహీన వర్గాల కోసం విశాఖపట్నం కార్యనిర్వాహక రాజధాని తీసుకువెళ్లి తీరతామని, రాయలసీమలో జ్యుడిషియల్ రాజధాని, శాసన రాజధాని అమరావతిలోనే ఉంటుందని కొడాలి నాని స్పష్టం చేశారు.