Webdunia - Bharat's app for daily news and videos

Install App

కారులో ప్రేమజంట అసభ్యప్రవర్తన, తప్పని చెప్పిన పాపానికి యువకుడు?

Webdunia
శనివారం, 15 జూన్ 2019 (11:12 IST)
హైదరాబాద్ నెక్లస్ రోడ్డు ప్రాంగణం ప్రేమికులకు అడ్డగా మారింది. స్నేహితులు, ప్రేమికులు కాసేపు సరదాగా కూర్చుని మాట్లాడుకుంటే సాధారణ ప్రజలకు ఇబ్బంది ఉండదు కానీ.. కొందరు ప్రేమికులు బరితెగించి ప్రవరిస్తున్న తీరుపై సభ్యసమాజం తలదించుకొనేలా చేస్తోంది. జలవిహార్ దగ్గర  కారులో ఓ ప్రేమ జంట అసభ్యకరంగా ప్రవర్తిస్తుండటంతో మందలించిన పాపానికి ఆ యువకుడు ప్రాణాలు మీదకే తెచ్చింది. 
 
రెండు రోజుల క్రితం హైదరాబాద్ నెక్లెస్ రోడ్డులో జరిగిన దాడి ఘటనలో మృత్యువుతో పోరాడి చివరికి ప్రాణాలు విడిచాడు ఆ యువకుడు. సాయిసాగర్ అనే యువకుడు తన మిత్రుడి బర్త్ డే వేడుకలు జరుపుకునేందుకు నెక్లెస్ రోడ్డుకు వెళ్లాడు. జల విహార్ ప్రాంతంలో కారులో మోబిన్ అనే వ్యక్తి తన గర్ల్ ఫ్రెండ్‌తో అసభ్యంగా ప్రవర్తించసాగాడు. గమనించిన సాయిసాగర్ ఇది పద్దతి కాదంటూ మోబిన్‌ను మందలించాడు. 
 
తన ప్రియురాలి ముందు అవమానం జరిగినట్టు భావించిన మోబిన్ ఆవేశంతో రగిలిపోయాడు. సాయిసాగర్‌తో పాటు అతని మిత్రులపై పిడిగుద్దుల వర్షం కురిపించాడు. విషయం పోలీసులకు చేరి సంఘటనా స్థలానికి చేరుకుని మోబిన్‌ను అదుపులోనికి తీసుకుని సాయిసాగర్‌ను ఆసుపత్రిలో చేర్పించారు. ఒంటికి బలమైన గాయాలు తగలడంతో మృత్యువుతో పోరాడి సాయిసాగర్ మృతి చెందాడు. 
 
సాయిసాగర్‌కు వివాహమై నెల రోజులు కూడా కాలేదు, ఇంతలోనే సాయిసాగర్ హత్యకు గురవడంతో ఆ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. సాయిసాగర్‌ను హత్య చేసిన కేసులో నిందితుడైన మోబిన్‌పై మిర్యాలగూడలో 16 కేసులు ఉన్నాయి. పీడీ యాక్టు కేసు కూడా నమోదైంది. ఇటీవలే జైలు నుంచి వచ్చిన మోబిన్ ఈ హత్యకు పాల్పడ్డాడని.. మోబిన్‌ను తమకు అప్పగిస్తే అతనికి శిక్షతామే విధిస్తామని అర్థరాత్రి ఉస్మానియా ఆసుపత్రిలో బాధితులు ఆందోళనకు దిగారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Malavika: హీరోయిన్లను అలా చూపించేందుకు దర్శకులు ఇష్టపడతారు

Anushka: ఘాటి చిత్ర విజయంపై అనుష్క శెట్టి కెరీర్ ఆధారపడి వుందా?

శివరాజ్ కుమార్ చిత్రం వీర చంద్రహాస తెలుగులో తెస్తున్న ఎమ్‌వీ రాధాకృష్ణ

Dhanush: కుబేర ఫస్ట్ సింగిల్ పోయిరా మామా..లో స్టెప్ లు అదరగొట్టిన ధనుష్

మలేషియాలో చిత్రీకరించబడిన విజయ్ సేతుపతి ACE చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెయ్యి ఆరోగ్య ప్రయోజనాలు

World Liver Day 2025 ప్రపంచ కాలేయ దినోత్సవం 2025 థీమ్ ఏమిటి?

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

తర్వాతి కథనం
Show comments