Webdunia - Bharat's app for daily news and videos

Install App

మోడల్‌తో ప్రేమాయణం.. బెంజ్ కార్లో చక్కర్లు... దానధర్మాలు... ఘరానా దొంగ లీలలు

Webdunia
ఆదివారం, 20 అక్టోబరు 2019 (12:56 IST)
హైదరాబాద్ నగర పోలీసులకు మోస్ట్ వాంటెడ్ దొంగగా ఉన్న ఇర్ఫాన్ (30) ముంబై పోలీసులకు పట్టుబడ్డాడు. ఆ తర్వాత అతని వద్ద జరిపిన విచారణలో విస్తుపోయే నిజాలు వెలుగు చూశాయి. మోడల్‌తో ప్రేమలో మునిగితేలిన ఇర్ఫాన్... బడా బాబుల ఇళ్లే లక్ష్యంగా చోరీలు చేస్తూ వచ్చాడు. అదీ కూడా బెంజ్ కారులో దర్జాగా వచ్చి దోచుకుని వెళ్లేవాడు. ఆ సొమ్ములో కొంత మోడల్‌కు, మరికొంత స్వగ్రామంలో దానధర్మాలు చేస్తూ వచ్చినట్టు పోలీసుల విచారణలో తేలింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, హైదరాబాద్‌కు చెందిన ఇర్ఫాన్ ఢిల్లీలోని 12 మంది బడాబాబుల ఇళ్లలో దొంగతనానికి పాల్పడినట్టు అంగీకరించాడు. ప్రియురాలితో కలిసి బ్యాంకాక్, ఇండొనేషియా దేశాల్లో పర్యటించి సరదాలు తీర్చుకున్నట్టు చెప్పాడు. హైదరాబాద్ నగరంలోని జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, అమీర్ పేటలోని ఇళ్లల్లో జరిగిన దొంగతనాల్లోనూ ఇతని ప్రమేయం ఉందని తేల్చారు. 
 
గతంలో ఎమ్మెల్యే కాలనీలోని ఓ ఇంట్లో దొంగతనం జరిగినప్పుడు, అక్కడి సీసీటీవీ ఫుటేజీల్లో బెంజ్ కారు కనిపించగా, దొంగ బెంజ్ కారులో ఎందుకు వస్తాడన్న ఆలోచనతో బంజారాహిల్స్ క్రైమ్ పోలీసులు పెద్దగా పట్టించుకోలేదు. అతను దొంగతనాలకు వెళ్లేటప్పుడు కూడా బెంజ్ కారులోనే వెళ్తున్నాడని తెలుసుకున్న పోలీసులు ఇప్పుడు నోరెళ్లబెడుతున్నారు.
 
పైగా, తాను దొంగతనం చేసిన మొత్తంలో కొంత బీహార్ రాష్ట్రంలోని తన స్వగ్రామంలో దాన ధర్మాలు, పేదల అమ్మాయిలకు వివాహాలు చేసినట్టు తెలిపాడు. ఇర్ఫాన్‌ను మరింత లోతుగా విచారిస్తున్నామని ఉన్నతాధికారులు తెలిపారు.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments