Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేసీఆర్‌కు మురుగు నీరు పార్శిల్స్.. పోస్టులో 60 పెట్టెలు

Webdunia
గురువారం, 22 ఆగస్టు 2019 (19:36 IST)
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌తో పాటు ఆయన తనయుడు, తెరాస వర్కింగ్ కమిటీ అధ్యక్షుడు కేటీఆర్‌, మాజీ మంత్రి హరీష్ రావులకు గుర్తు తెలియని వ్యక్తులు మురుగునీటి పార్శిల్స్‌ను పంపించారు. ఏకంగా 60 పెట్టెల్లో పోస్టులో మురుగునీటి బాటిల్స్‌ను పంపించారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం హాస్టల్స్‌లో తాగునీరు అందుబాటులో లేదనీ అందువల్ల మురుగునీరు తాగుతున్నారని పేర్కొంటూ ఓ లేఖను కూడా రాశారు. ఈ 60 బాక్సులు పోస్టులో సికింద్రాబాద్ పోస్టాఫీసు నుంచి వచ్చాయి. ఇది తీవ్ర కలకలం రేగింది. 
 
దీంతో నార్త్ రేంజ్ పోలీసులు కేసు నమోదు చేసి లోతుగా దర్యాప్తు చేపట్టారు. ఈ దర్యాప్తులో మురుగునీటి బాటిల్స్ పంపిన నిందితుడిని గుర్తించారు. సీసీ కెమెరాల ఆధారంగా అతడిని సికింద్రాబాద్‌కు చెందిన వ్యక్తిగా గుర్తించారు. అతని వద్ద పోలీసులు విచారణ జరుపుతున్నారు. 
 
నిజానికి వీటిని రసాయనాలుగా భావించిన పోలీసులు పరీక్ష కోసం ల్యాబ్‌కు పంపించారు. అందులో ఉన్నవి రసాయనాలు కాదని తేలడంతో ఊపిరి పీల్చుకున్నారు. తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చేందుకే నిందితుడు ఇలా చేసినట్లు సమాచారం. అతడి మానసిక స్థితిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. 
 
సికింద్రాబాద్‌ తపాలా కార్యాలయానికి ఒకే తరహాలో ఉన్న 60 పెట్టెలు వచ్చాయి. వాటి నుంచి విపరీతమైన దుర్వాసన వస్తోంది. వాటిపై బట్వాడా చేయాల్సిన చిరునామాలను చూసి సిబ్బంది నిర్ఘాంతపోయారు. గవర్నర్‌ నరసింహన్‌, ముఖ్యమంత్రి కేసీఆర్‌, తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కె.తారక రామారావు, మాజీ ఎంపీ కవిత, డీజీపీ మహేందర్‌ రెడ్డి, హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ వి.అంజనీకుమార్‌, ఐదుగురు డీసీపీలు... ఇలా అంతా పేరొందిన ప్రముఖులే. 
 
పెట్టెల్ని తెరిచి చూస్తే సీసాలు కనిపించాయి. వాటిల్లో రసాయనాల మాదిరి ద్రవం ఉంది. ఒక్కోసీసాలో లీటరున్నర దాకా ఉంటుంది. రసాయన బాంబులేమోనన్న అనుమానంతో అధికారులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. హుటాహుటిన రంగంలోకి దిగిన పోలీస్‌ బృందం సీసాలను పరిశీలించింది. ఇందులో ఏవైనా విష పదార్థాలు, పేలుడు పదార్థాలున్నాయా అని నిర్ధారించుకునేందుకు ఫోరెన్సిక్‌ ప్రయోగశాలకు పంపించామని పోలీస్‌ అధికారులు తెలిపారు. అక్కడ అవి రసాయనాలు కాదనీ, మురుగునీరని తేలడంతో ఊపిరి పీల్చుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

లైసెన్స్ ఉన్న బెట్టింగ్ యాప్‌‍లకే విజయ్ దేవరకొండ ప్రచారం చేశారట...

వాళ్లు ఇచ్చిన ఫీడ్‌బ్యాక్‌ టుక్‌టుక్‌ చిత్రం విజయంపై నమ్మకం పెరిగింది : నిర్మాత రాహుల్‌ రెడ్డి

Sapthagiri: తాగితే బ్రెయిన్ షార్ప్ గా తందానా అంటుందా !

betting apps: బెట్టింగ్ యాప్స్ తో సంబంధంలేదని ప్రకటించిన విజయ్ దేవరకొండ

Kiss Song from Jack: జాక్ - కొంచెం క్రాక్.. కిక్కాస్ టీజర్ విడుదల- ఏప్రిల్ 10న రిలీజ్ (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

Taro Leaves: మహిళల్లో ఆ క్యాన్సర్‌ను దూరం చేసే చేమదుంపల ఆకులు.. డయాబెటిస్ కూడా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

హైదరాబాద్‌లో యువత ప్రమాదంలో ఉంది: స్ట్రోక్ కేసుల పెరుగుదల ముందస్తు జోక్యం కోసం అత్యవసర పిలుపు

తర్వాతి కథనం
Show comments