Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అదిరే అందాలతో హైదరాబాద్‌లో అమెజాన్ భారీ క్యాంపస్ (వీడియో)

Advertiesment
అదిరే అందాలతో హైదరాబాద్‌లో అమెజాన్ భారీ క్యాంపస్ (వీడియో)
, బుధవారం, 21 ఆగస్టు 2019 (19:00 IST)
ఈ -కామర్స్ దిగ్గజం అమెజాన్ తన నూతన కార్యాలయాన్ని హైదరాబాద్ నగరంలో ప్రారంభించింది. అదిరే అందాలతో ఈ కార్యాలయాన్ని నిర్మించింది. ఇది అమెరికా తర్వాత అతిపెద్ద కార్యాలయంగా భావిస్తున్నారు. ఈ భారీ క్యాంపస్‌ గురించి అమెజాన్ ఇండియా మేనేజ‌ర్‌ అమిత్ అగ‌ర్వాల్ మాట్లాడుతూ... గ‌త 15 ఏళ్ల‌లో ఇండియాలో అమెజాన్ రూపుదిద్దుకున్న తీరును ఆయ‌న వివ‌రించారు. 
 
కొన్నేళ్ల క్రితం కేవ‌లం అయిదుగురు స‌భ్య‌లుతో అమెజాన్ ఏర్పాటు కోసం ఇక్క‌డ‌కు వ‌చ్చిన‌ట్లు ఆయ‌న చెప్పారు. ప్ర‌స్తుతం ఇండియాలో సుమారు 62 వేల మంది అమెజాన్‌లో ప‌నిచేస్తున్న‌ట్లు ఆయ‌న తెలిపారు. క్యాంప‌స్‌ను రాష్ట్ర హోంమంత్రి మెహ‌బూద్ అలీ ప్రారంభించారు. మంత్రి అలీకి క్యాంప‌స్ గురించి అమెజాన్ ఇండియా మేనేజ‌ర్‌ అమిత్ అగ‌ర్వాల్ వివ‌రించారు. గ‌చ్చిబౌలిలోని నాన‌క్‌రామ్ గూడ‌లో ఏర్పాటు చేసిన ఈ క్యాంప‌స్‌.. అమెరికా త‌ర్వాత అతిపెద్ద క్యాంప‌స్ కావ‌డం విశేషం. తెలంగాణ‌కు ఇది గ‌ర్వ‌కార‌ణ‌మ‌ని, తెలంగాణ‌లోనే ఇదే అతిపెద్ద బిల్డింగ్ అని హోంమంత్రి అలీ అన్నారు. 
 
కాగా, ఈ క్యాంపస్‌లో ఆర్టిఫిషియ‌ల్ ఇంజినీరింగ్‌, ఎంఎల్ టెక్‌లోనూ అమెజాన్ త‌న సేవ‌ల్ని అందించ‌నుంది. అమెరికా త‌ర్వాత విదేశాల్లో ఉన్న క్యాంప‌స్‌ల‌లో.. ఇది అమెజాన్ స్వంత బిల్డింగ్ కావ‌డం విశేషం. గ్లోబ‌ల్ రియ‌ల్ ఎస్టేట్ అండ్ ఫెసిలిటీస్ డైర‌క్ట‌ర్ జాన్ ష్కెట్ల‌ర్ కూడా మాట్లాడారు. సుమారు 15 వేల మంది అమెజాన్ క్యాంప‌స్‌లో ప‌నిచేయ‌నున్నారు. సోష‌ల్ మీడియాలో క్యాంప‌స్ ప్రారంభంపై ట్వీట్లు వెల్లువెత్తుతున్నాయి.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రెండు నోర్లు ఉన్న చేపను మీరు ఎప్పుడైనా చూసారా?