Webdunia - Bharat's app for daily news and videos

Install App

పిలిస్తే పలుకలేదని ఫ్రెండ్‌ను చంపేశారు.. ఎక్కడ?

ద్విచక్రవాహనంపై వెళుతున్న వ్యక్తిని కొందరు వ్యక్తులు పిలిచారు. బైక్ శబ్దానికి వాహనంపై వెళుతున్న వ్యక్తికి వినిపించలేదు. దీంతో ఆగ్రహించిన ఆ కిరాతకులు.. తిరుగు ప్రయాణంలో బైక్‌ను ఆపి సదరు వ్యక్తిని కత్తి

Webdunia
బుధవారం, 18 జులై 2018 (18:11 IST)
ద్విచక్రవాహనంపై వెళుతున్న వ్యక్తిని కొందరు వ్యక్తులు పిలిచారు. బైక్ శబ్దానికి వాహనంపై వెళుతున్న వ్యక్తికి వినిపించలేదు. దీంతో ఆగ్రహించిన ఆ కిరాతకులు.. తిరుగు ప్రయాణంలో బైక్‌ను ఆపి సదరు వ్యక్తిని కత్తితో పీకకోసి చంపేశారు. ఈ దారుణం హైదరాబాద్‌లోని మంగళహాట్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో జరిగింది.
 
ఈ వివరాలను పరిశీలిస్తే, జిర్రా కిషన్‌నగర్‌కు చెందిన జాఫర్ అనే వ్యక్తి కుమారుడు మహమ్మద్ ఇసా (22) పండ్ల వ్యాపారి... శనివారం రాత్రి పని ముగించుకుని ఇంటికొచ్చిన ఇసాను అతడి స్నేహితుడు మాజిద్ పని ఉందని బైక్‌పై బయటకు తీసుకెళ్లాడు. మార్గమధ్యలో బైక్‌పై వెళ్తున్న ఇసాను చూసిన అతడి స్నేహితులు మహమూద్, ముస్తాపాలు పిలిచారు. అది వినబడకపోవడంతో ఇసా పట్టించుకోలేదు.
 
రాత్రి 11:30 గంటలకు ఇసా తిరిగి వచ్చేవరకు అక్కడే కాపు కాసిన స్నేహితులు మరోమారు పిలిచారు. దీంతో స్నేహితుల దగ్గరకు వెళ్లిన ఇసాతో గొడవకు దిగారు. పిలిచినా పట్టించుకోకుండా ఎందుకు వెళ్లిపోయావంటూ వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో ఇసా, మహమూద్‌ మధ్య మాటామాటా పెరిగి... ఒక్కసారిగా కత్తితో ఇసాపై దాడిచేశాడు. చాతిపై కత్తిపోట్లు తగలడంతో ఇసా కుప్పకూలిపోయాడు. 
 
సమాచారం అందుకున్న పోలీసులు ఇసాను ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇసా మృతిచెందినట్టు వైద్యులు తెలిపారు. నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు రిమాండ్‌కు తరలించారు. పిలిస్తే పలకలేదన్న కోపంతో క్షణికావేశంతో స్నేహితుడి ప్రాణాలు తీసిన ఈ ఘటన కలకలం రేపుతోంది. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments