Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒకరితో పెళ్లి.. ఇద్దరితో అక్రమ సంబంధం.. భార్యకు తెలిసి...

ఓ వ్యక్తి ఓ మహిళను పెళ్లాడాడు. ఇద్దరితో వివాహేతర సంబంధం కొనసాగించాడు. ఈ విషయం తెలిసిన భార్య జీర్ణించుకోలేకపోయింది. భర్త చేసిన నమ్మక ద్రోహాన్ని తట్టుకోలేక ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ ఘటన హైదరాబాద్

Webdunia
ఆదివారం, 30 సెప్టెంబరు 2018 (18:03 IST)
ఓ వ్యక్తి ఓ మహిళను పెళ్లాడాడు. ఇద్దరితో వివాహేతర సంబంధం కొనసాగించాడు. ఈ విషయం తెలిసిన భార్య జీర్ణించుకోలేకపోయింది. భర్త చేసిన నమ్మక ద్రోహాన్ని తట్టుకోలేక ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ ఘటన హైదరాబాద్ నగరంలో వెలుగు చూసింది. ఈ వివరాలను పరిశీలిస్తే...
 
హైదరాబాద్, బంజారాహిల్స్‌లోని ఎస్వీనగర్‌లో నివసించే శ్రీలక్ష్మి(26), వేణుగోపాల్‌ అలియాస్‌ వంశీ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరి వివాహం గత 2012లో జరిగింది. వీరి సంసారజీవితం కొంతకాలం పాటు సాఫీగానే సాగింది. ఈ క్రమంలో తనతో పాటు పని చేసే ఓ యువతితో వంశీకి పరిచయం ఏర్పడి అది వివాహేతర సంబంధానికి దారితీసింది. 
 
ఈ విషయం భార్యకు తెలియడంతో ఇద్దరి మధ్య గొడవలు జరిగి విషయం కోర్టు వరకు వెళ్లింది. ఇదిలావుండగా, సంస్థ ప్రచార పని మీద వంశీ గోవాకు వెళ్లాడు. అక్కడ మరో యువతితో సంబంధం నెరిపాడు. ఆమెనూ వివాహం చేసుకొనేందుకు నిర్ణయించుకున్నాడు. అతని భార్యకు తెలియడంతో మనోవేదనకు గురై శుక్రవారం నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. సమయానికి ఇంట్లో ఉన్న ఆమె సోదరి ప్రశాంతి అక్క పరిస్థితిని గమనించి జూబ్లీహిల్స్‌లోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స చేయించడంతో ప్రాణగండం తప్పింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sidhu Jonnalagadda: సిద్ధు జొన్నలగడ్డ, రాశీ ఖన్నా మధ్య కెమిస్ట్రీ తెలుసు కదా

గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా రూపొందిస్తోన్న మూవీ ఆకాశంలో ఒక తార

నాలుగు వంద‌ల కోట్ల బ‌డ్జెట్‌తో హృతిక్ రోష‌న్‌, ఎన్టీఆర్. వార్ 2 ట్రైల‌ర్‌ స‌రికొత్త రికార్డ్

కబడ్డీ ఆటగాడి నిజజీవితాన్ని ఆధారంగా అర్జున్ చక్రవర్తి

1950ల మద్రాస్ నేప‌థ్యంలో సాగే దుల్కర్ సల్మాన్ కాంత గ్రిప్పింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments