Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

భార్యాభర్తల గొడవతో భాగస్వామి ఆరోగ్యానికి చేటు...

భార్యాభర్తలు చీటికిమాటికి గొడవ పడుతుంటే భాగస్వామి ఆరోగ్యానికి చేటు కలుగుతుందని తాజాగా నిర్వహించిన ఓ సర్వేలో వెల్లడైంది. భార్యాభర్తల గొడవు, భాగస్వామి ఆరోగ్యం అనే అంశంపై ఓహియో యూనివర్సిటీ పరిశోధకులు ఓ అ

Advertiesment
భార్యాభర్తల గొడవతో భాగస్వామి ఆరోగ్యానికి చేటు...
, ఆదివారం, 30 సెప్టెంబరు 2018 (16:11 IST)
భార్యాభర్తలు చీటికిమాటికి గొడవ పడుతుంటే భాగస్వామి ఆరోగ్యానికి చేటు కలుగుతుందని తాజాగా నిర్వహించిన ఓ సర్వేలో వెల్లడైంది. భార్యాభర్తల గొడవు, భాగస్వామి ఆరోగ్యం అనే అంశంపై ఓహియో యూనివర్సిటీ పరిశోధకులు ఓ అధ్యయనం నిర్వహించారు. ఇందులో వెల్లడైన వివరాలను పరిశీలిస్తే...
 
ఆరోగ్యంగా ఉన్న 50 జంటలపై ఈ పరిశోధనసాగింది. ఈ జంటల మధ్య ప్రేమానురాగాలు, సంబంధాల గురించి అడిగి తెలుసుకున్నారు. ఇద్దరూ ఏకీభవించని ఏదైనా అంశంపై చర్చించమని పరిశోధకులు ప్రోత్సహించారు. జంటల్ని ఒంటరిగా వదిలేసి వారి చర్చల్ని, వాళ్లు గొడవపడ్డ తీరును రికార్డ్ చేశారు. అంతేకాదు గొడవలో ఉపయోగించిన పదాలను, హావభావాలను, ఒకరినొకరు విమర్శించిన తీరును జాగ్రత్తగా పరిశీలించారు. గొడవకు ముందు, గొడవ తర్వాత వారి రక్తనమూనాలను పోల్చి చూశారు.
 
మిగతావారితో పోలిస్తే గొడవ సమయంలో ఒకరినొకరు ఎక్కువగా ద్వేషించినవారిలో లీకీ గట్ సిండ్రోమ్‌కు సంబంధించిన లక్షణాలు కనిపించాయి. జీవిత భాగస్వామితో తరచూ గొడవపడేవారిలో డిప్రెషన్, మూడ్ డిజార్డర్ వంటి సమస్యలున్నట్టు తేలింది. జీవితభాగస్వామిపట్ల ద్వేషం, శతృభావనలకు రక్తంలో బ్యాక్టీరియాకు సంబంధమున్నట్టు నిర్థారించారు. సో... భార్యాభర్తల మధ్య గొడవలతో మానసికశాంతి లేకపోవడమే కాదు... చివరకు ఆరోగ్య సమస్యలు కూడా వస్తాయన్నమాట.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అశ్లీల బొమ్మలను చూస్తూ శృంగారం చేయడం జబ్బా?