Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

చెల్లితో కలిసి ఫేస్‌బుక్ ప్రియుడితో అక్క రాసలీలలు.. భర్తకు చూడగానే కత్తితో దాడి.. ఎక్కడ?

చెల్లితో కలిసి అక్క తన ఫేస్‌బుక్ ప్రియుడుతో కలిసి రాసలీలల్లో మునిగిపోయింది. ఈ దృశ్యాన్ని చూసిన భర్తపై ఆ మహిళ వంటింట్లోని కత్తితో దాడిచేసింది. ఈ దాడిలో భర్త తీవ్రంగా గాయపడ్డాడు. చెన్నైలో జరిగిన ఈ వివరా

చెల్లితో కలిసి ఫేస్‌బుక్ ప్రియుడితో అక్క రాసలీలలు.. భర్తకు చూడగానే కత్తితో దాడి.. ఎక్కడ?
, బుధవారం, 26 సెప్టెంబరు 2018 (16:10 IST)
చెల్లితో కలిసి అక్క తన ఫేస్‌బుక్ ప్రియుడుతో కలిసి రాసలీలల్లో మునిగిపోయింది. ఈ దృశ్యాన్ని చూసిన భర్తపై ఆ మహిళ వంటింట్లోని కత్తితో దాడిచేసింది. ఈ దాడిలో భర్త తీవ్రంగా గాయపడ్డాడు. చెన్నైలో జరిగిన ఈ వివరాలను పరిశీలిస్తే...
 
స్థానిక పురసైవాక్కంకు చెందిన కిషోర్ కొఠారి అనే వ్యక్తి స్థానికంగా ద్విచక్ర వాహనాలకు ఫైనాన్స్ చేసే వ్యాపారం చేస్తున్నాడు. ఈయనకు భార్య ప్రమీల ఉంది. వీరితో పాటు ప్రమీల చెల్లెలు కూడా ఉంటోంది. 
 
దీంతో ఇంట్లోనే ఉండేవీరిద్దరూ ఫేస్‌బుక్‌లో చాటింగ్ చేసేవారు. ఈ క్రమంలో రాజస్థాన్‌కు చెందిన రాజేష్ అనే 20 యేళ్ల కుర్రోడు పరిచయమయ్యాడు. ఆ ఆ యువకుడు డిగ్రీ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. వారిద్దరి మధ్య ఏర్పడిన పరిచయం కాస్త ప్రేమకు దారితీసింది. దీంతో రాజేష్‌ను రాజస్థాన్ నుంచి చెన్నైకు పిలిపించింది. 
 
అయితే, బయటకు వెళ్లి కలిస్తే తమ వ్యవహారం తెలిసిపోతుందని భావించిన ప్రమీల తన భర్త పనికి వెళ్లగానే ప్రియుడుని ఇంటికి పిలిపించుకునేది. ఆ సమయంలో చెల్లిని ఇంటి బయట కాపలాపెట్టేది. ఈ క్రమంలో సోమవారం షాపుకు వెళ్లిన కిషోర్.. ఉదయం 11 గంటలకే ఇంటికి వచ్చాడు. అతని రాకను ప్రమీల చెల్లి కూడా గుర్తించలేదు. 
 
దీంతో కిషోర్ నేరుగా ఇంట్లోకి వెళ్ళగా, తన భార్య మరో యువకుడితో ఏకాంతంగా ఉండటాన్ని చూసి నిశ్చేష్టుడయ్యాడు. ఆ తర్వాత భార్యపై చేయి చేసుకునేందుకు ప్రయత్నించాడు. కానీ, భార్య వంటింట్లోకి వెళ్లి కత్తి తీసుకుని భర్తపై దాడి చేసింది. ఈ దాడిలో కిషోర్ తీవ్రంగా గాయపడ్డాడు. ఆ రక్తపు గాయాలతోనే నేరుగా కీల్పాక్కం స్టేషన్‌కు వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో ప్రమీల, ఆమె చెల్లి, ప్రియుడు రాజేష్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

షూ లేస్ కట్టుకుంటున్న బాలుడి పై నుంచి వెళ్లిన కారు? తర్వాత ఏమైందంటే?