Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇథియోపియాలో ఘోరం... హైదరాబాదీ సజీవ దహనం..

Webdunia
గురువారం, 21 మార్చి 2019 (10:16 IST)
ఆఫ్రికాలోని ఇథియోపియాలో అత్యంత కిరాతకమైన ఘోరం చోటు చేసుకుంది. కొంత మంది దుండుగుల దురాగతానికి హైదరాబాద్‌కు చెందిన వ్యాపారవేత్త బలయ్యారు. రాగి గనుల వ్యాపారం నిమిత్తం ఇథియోపియాకి వెళ్లిన పీవీ శశిధర్‌ కారును అడ్డుకున్న దుండగులు పెట్రోల్ పోసి నిప్పంటించారు. ఈ ఘటనలో ఆయనతోపాటు మరో నలుగురు ప్రాణాలు కోల్పోయారు.
 
వివరాలలోకి వెళ్తే... హైదరాబాద్‌ అశోక్‌నగర్‌కు చెందిన పీవీ శశిధర్ బాలానగర్ సమీపంలో పంటల ఉత్పత్తులు, ఇతర వస్తువులను నిల్వ చేసేందుకు ఏసీ గోదాములు నిర్వహిస్తూంటారు. రాగి గనుల వ్యాపారం చేయాలనే ఉద్దేశంతో గత కొంతకాలంగా ఇథియోపియాకి వెళ్లి వస్తున్నారు. దీనికి సంబంధించి ఆ దేశ ప్రభుత్వం ఆయనకు అనుమతులు కూడా మంజూరు చేసింది. 
 
19వ తేదీన రాగి గనుల క్షేత్ర పరిశీలనకు రెండు కార్లలో పదిమంది బయల్దేరడం జరిగింది. ముందు కారులో ఐదుగురు ఉండగా... వెనుక కారులో శశిధర్‌తో పాటు ఒక జపాన్‌ మహిళ, ముగ్గురు ఇథియోపియన్లు ఉన్నారు. కొంతదూరం వెళ్లాక శశిధర్‌ ప్రయాణిస్తున్న కారుపై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. కాల్పుల నుండి తేరుకొనేలోగానే కారుపై పెట్రోల్ పోసి నిప్పటించి వెళ్లిపోయారు. దీంతో కారులో ఉన్న శశిధర్‌‌తో సహా ఐదుగురు సజీవ దహనమయ్యారు. శశిధర్‌కు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఆయన మృతితో అశోక్‌నగర్‌లో విషాదఛాయలు అలుముకున్నాయి. 
 
ఈ నెలలోనే ఇథియోపియాలో జరిగిన విమాన ప్రమాదంలో గుంటూరు నగరానికి చెందిన యువ డాక్టర్ మనీషా ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ ఘటనను మరువకముందే మరో తెలుగు వ్యక్తి కూడా ఇథియోపియాలో ప్రాణాలు కోల్పోవడం మరింత విషాదకరం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాజాసాబ్ నుంచి సంజూ బాబాకు శుభాకాంక్షలు తెలుపుతూ సంజయ్ దత్ లుక్

Gopichand: గోపీచంద్ రెండు సినిమాలపై శ్రద్ధ పెడుతున్నాడు

సంగీత దర్శకుడు అనిరుధ్‌ను కిడ్నాప్ చేస్తానంటున్న విజయ్ దేవరకొండ

హెబ్బా పటేల్, రేఖ నిరోషా నటించిన థాంక్యూ డియర్ విడుదలకు సిద్ధమైంది

వార్ 2 లోని హృతిక్, కియారా డ్యూయెట్ సాంగ్ కోసం బ్రహ్మాస్త్ర కేసరియా టీం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments