Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

'సాహో'కి బ్రేక్ ఇచ్చి మరీ మరో సినిమాకి సిద్ధమైన డార్లింగ్

Advertiesment
Prabhas
ఒక వైపున సుజిత్ దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న 'సాహో' సినిమాలో నటిస్తూనే .. మరో వైపున రాధాకృష్ణ దర్శకత్వంలోని ఓ సినిమా చేయడానికి ప్రభాస్ రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. భారీ యాక్షన్ ఎంటర్టైనర్‌గా రూపొందుతున్న 'సాహో' చేస్తూనే, రాధాకృష్ణ దర్శకత్వంలో ఫ్యామిలీ ఎంటర్టైనర్ తొలి షెడ్యూల్‌ను యూరప్‌లో పూర్తి చేసాడు ప్రభాస్... ఈ సినిమా తదుపరి షెడ్యూల్‌ హైదరాబాద్‌లో జరుగనున్నట్లు వినికిడి. 
 
కాగా... ఈ హైదరాబాద్ షెడ్యూల్ కోసం 'సాహో'కి బ్రేక్ ఇచ్చి మరీ ఈ సినిమా షూటింగ్‌లో పాల్గొననున్నాడట ప్రభాస్. హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోలో ఈ గురువారం నుంచి 16 రోజుల పాటు షూటింగ్ జరగనుంది. ఇందులో ప్రభాస్ .. పూజా హెగ్డే తదితరులపై కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. 1960 కాలం నాటి నేపథ్యంలో సాగే ఈ ప్రేమకథ తెలుగు.. తమిళం.. హిందీ భాషలలో 2020లో విడుదల కానుందట.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

త్రిషకి... భారీ ఛాన్స్? అమితాబ్‌ బచ్చన్‌తో కలిసి?