Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెళ్లైంది.. నలుగురు పిల్లలకు తండ్రి.. కానీ యువతిపై పలుమార్లు అత్యాచారం..

Webdunia
మంగళవారం, 19 మే 2020 (13:01 IST)
పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఓ యువతిని మోసం చేశాడు. సోషల్ మీడియా పరిచయం ఆ యువతి కొంపముంచింది. పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో నమ్మిన సదరు యువతి పలుమార్లు అత్యాచారానికి గురైంది. ఈ అమానుష ఘటన హైదరాబాద్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. పాతబస్తీకి చెందిన ఓ యువతి(27)కి టిక్‌టాక్‌లో తలాబ్‌కట్ట నషేమన్‌నగర్‌ వాసి అక్బర్‌షా(34)తో పరిచయం ఏర్పడింది. 
 
ఆ పరిచయం ఇద్దరి మధ్య ప్రేమకు దారి తీసింది. గాఢంగా ప్రేమిస్తున్నానని, పెళ్లంటూ చేసుకుంటే నిన్నే చేసుకుంటానని ఆమెను నమ్మించాడు. ఆ మోసగాడి మాటలు నమ్మిన అమాయకురాలు.. తన సర్వస్వాన్ని అప్పగించింది. ఓ రోజు ఇద్దరు కలిసి టోలీచౌకీలోని అక్బర్ షా సోదరి ఇంటికి వెళ్లారు. అక్కడికి వెళ్లాక గానీ ఆ యువతికి తెలియరాలేదు.
 
చివరికి తాను మోసపోయాననే విషయం తెలుసుకుని పలుమార్లు అత్యాచారానికి గురైంది. తన తప్పును కప్పి పుచ్చుకునేందుకు పెళ్లి చేసుకుంటానని బంధువుల సమక్షంలో ఉత్తుత్తి నిశ్చితార్థం చేసుకున్నాడు. ఆ తర్వాత మళ్లీ అత్యాచారానికి పాల్పడ్డాడు.
 
ఆ రోజు నుంచి ఇప్పటిదాకా ఆచూకీ లేకుండా పోయాడు. బాధితురాలు ఆదివారం చాంద్రాయణగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేయడంతో దర్యాప్తు చేపట్టారు. అప్పటికే అక్బర్ షాకు పెళ్లైందని, నలుగురు పిల్లలు కూడా ఉన్నట్లు గుర్తించారు. ప్రస్తుతం పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలింపు చేపట్టారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గాంధీ తాత చెట్టు అందరి హృదయాలను హత్తుకుంటాయి: పద్మావతి మల్లాది

త్రిష, వినయ్ రాయ్ నటించిన ఐడెంటిటీ తెలుగు ట్రైలర్ లాంచ్

భైరవం టీజర్ ఈవెంట్ లో ఆడిపాడిన అతిధి శంకర్ - పక్కా హిట్ అంటున్న హీరోలు

హత్య ట్రైలర్ రిలీజ్ కాగానే డిస్ట్రిబ్యూటర్లే సినిమాను అడిగారు : దర్శకురాలు శ్రీవిద్యా బసవ

Vijay Ranga Raju: యజ్ఞం విలన్ నటుడు విజయ రంగరాజు మృతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరం లావయ్యేందుకు కారణమయ్యే అలవాట్లు ఇవే

నువ్వుండలను తింటున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

భారతదేశంలో సామ్‌సంగ్ హెల్త్ యాప్‌లో వ్యక్తిగత ఆరోగ్య రికార్డుల ఫీచర్‌ను ప్రవేశపెట్టిన సామ్‌సంగ్

యూరిక్ యాసిడ్ ఎలా తగ్గించుకోవాలి?

HMPV వ్యాధి నిరోధించేందుకు చిట్కాలు

తర్వాతి కథనం
Show comments