Webdunia - Bharat's app for daily news and videos

Install App

హైదరాబాదులో దారుణం.. మహిళను హత్యచేసి.. ప్లాస్టిక్ బ్యాగులో..?

హైదరాబాదులో దారుణం చోటుచేసుకుంది. పాతబస్తీలో మహిళ దారుణంగా హత్యకు గురైయ్యారు. ఆమె మృతదేహాన్ని ప్యాక్ చేసి రైల్వే ట్రాక్ పక్కన పడేశారు. వివరాల్లోకి వెళితే.. డబీర్ పూర్ స్టేషన్‌కు కొంచెం దూరంలో మహిళ మృత

Webdunia
సోమవారం, 21 మే 2018 (09:05 IST)
హైదరాబాదులో దారుణం చోటుచేసుకుంది. పాతబస్తీలో మహిళ దారుణంగా హత్యకు గురైయ్యారు. ఆమె మృతదేహాన్ని ప్యాక్ చేసి రైల్వే ట్రాక్ పక్కన పడేశారు. వివరాల్లోకి వెళితే.. డబీర్ పూర్ స్టేషన్‌కు కొంచెం దూరంలో మహిళ మృతదేహాన్ని పోలీసులు కనుగొన్నారు. మహిళను హత్య చేసి.. ఆ శరీరానికి బురఖా వేసి ప్లాస్టిక్ బ్యాగ్‌లో ఉంచారు. ఆపై ఆ బ్యాగ్‌ని బియ్యపు సంచిలో పెట్టారు.
 
స్థానికుల సమాచారం మేరకు పోలీసులు అక్కడికి చేరుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. కాగా, మహిళ హత్యకు గురై రెండు రోజులైందని, గుర్తుతెలియని వ్యక్తులు పక్కా పథకంతోనే ఈ దారుణానికి ఒడిగట్టారని పోలీసులు తెలిపారు. 
 
మరోవైపు సిద్ధిపేట జిల్లాలోని బెజ్జంకి మండలం శనిగారం వద్ద విషాద సంఘటన చోటుచేసుకుంది. గ్రామ సమీపంలో పురుగుల మందు తాగి నవదంపతులు ఆత్మహత్య చేసుకున్నారు.

ప్రేమవివాహం చేసుకున్న కాసేపటికే దంపతులు పురుగుల మందు తాగారు. గుర్తించిన స్థానికులు వారిని ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ యువతి అంజలి మృతి చెందగా, యువకుడు లోహిత్ పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ఆర్ఎక్స్-100' హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్‌కు పితృవియోగం

రాజాసాబ్ నుంచి సంజూ బాబాకు శుభాకాంక్షలు తెలుపుతూ సంజయ్ దత్ లుక్

Gopichand: గోపీచంద్ రెండు సినిమాలపై శ్రద్ధ పెడుతున్నాడు

సంగీత దర్శకుడు అనిరుధ్‌ను కిడ్నాప్ చేస్తానంటున్న విజయ్ దేవరకొండ

హెబ్బా పటేల్, రేఖ నిరోషా నటించిన థాంక్యూ డియర్ విడుదలకు సిద్ధమైంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments