Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

హైదరాబాద్ మెట్రో రైల్వే స్టేషన్లలో తాజా కూరగాయలు.. ఎలాగంటే?

హైదరాబాదు మెట్రో ప్రయాణీకులకు నిత్యావసర వస్తువులు సులభంగా అందనున్నాయి. మెట్రో రైళ్లలో ప్రయాణిస్తూనే.. నిత్యావసర వస్తువులను కొనుగోలు చేసే దిశగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. దీనికి సంబంధించి హైదరాబాద్ మెట్ర

Advertiesment
hyderabad
, ఆదివారం, 20 మే 2018 (15:47 IST)
హైదరాబాదు మెట్రో ప్రయాణీకులకు నిత్యావసర వస్తువులు సులభంగా అందనున్నాయి. మెట్రో రైళ్లలో ప్రయాణిస్తూనే.. నిత్యావసర వస్తువులను కొనుగోలు చేసే దిశగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. దీనికి సంబంధించి హైదరాబాద్ మెట్రోరైలు ప్రాజెక్టుకు రంగం సిద్ధం అవుతోంది. 
 
మెట్రో రైలు ప్రయాణీకులు గమ్యస్థానం చేరుకున్నాక.. ట్రైన్ దిగి.. ఇంటికి వెళ్ళే సమయంలో అవసరమైన తాజా కూరగాయల స్టాల్స్ ఏర్పాటు కానున్నాయి. తొలి విడతగా 11 ప్రధాన రైల్వే స్టేషన్లలో కూరగాయల స్టాళ్లను ఏర్పాటు చేస్తారు. ఆపై దశలవారీగా అన్నీ మెట్రో రైల్వే స్టేషన్లలో విస్తరించనున్నారు. 
 
ఈ క్రమంలో హైదరాబాద్ మెట్రోరైలు ప్రాజెక్టులో ప్రారంభమైన నాగోల్ నుంచి మియాపూర్ 30 కిలోమీటర్ల రూట్లలో ఉన్న 24 స్టేషన్లలో కూరగాయలు అందుబాటులోకి రానున్నాయి. ఉదయం 5 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు తాజా కూరగాయలను ప్రయాణికులకు అందుబాటులో ఉంచనున్నారు. 
 
కూరగాయలసాగు చేస్తున్న రైతులను ప్రోత్సహించాలనే ఉద్ధేశ్యంతో ప్రభుత్వం చేపట్టిన మన కూరగాయలు పథకం మెట్రో ప్రయాణికులకు వరంగా మారింది. ఇప్పటికే నగరమంతా ''మన కూరగాయలు'' పేరుతో కూరగాయలను మార్కెటింగ్ శాఖ ప్రజలకు అందుబాటులోకి తెచ్చిన సంగతి తెలిసిందే. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రేవతికి జనసేనాని సాయం.. గబ్బర్‌సింగ్ డైలాగ్స్, అన్నమయ్య కీర్తన విని పవన్?