సెల్ఫీతో సూసైడ్....?
హైదరాబాదులోని సరూర్ నగర్ పొలీస్ స్టేషన్ పరిధిలోని సరూర్ నగర్ జీహెచ్ఎంసి కార్యాలయ సమీపంలోని పంజాల అనిల్ కుమార్ కాలనీలో అద్దెకు ఉంటున్న ఘట్‌కేసర్ మండలం అన్నోజిగూడ గ్రామానికి చెందిన సాయి కుమార్ గౌడ్ అనే 21 సంవత్సరాల యువకుడు సెల్ఫీ వీడియో తీసుకొని బుధవా
హైదరాబాదులోని సరూర్ నగర్ పొలీస్ స్టేషన్ పరిధిలోని సరూర్ నగర్ జీహెచ్ఎంసి కార్యాలయ సమీపంలోని పంజాల అనిల్ కుమార్ కాలనీలో అద్దెకు ఉంటున్న ఘట్‌కేసర్ మండలం అన్నోజిగూడ గ్రామానికి చెందిన సాయి కుమార్ గౌడ్ అనే 21 సంవత్సరాల యువకుడు సెల్ఫీ వీడియో తీసుకొని బుధవారం రాత్రి 11 గంటల సమయంలో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
మృతుడు ఓ ప్రముఖ ప్రైవేట్ సంస్థలో మార్కెట్ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేస్తున్నాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టి, శవపరిక్ష నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఐతే అతడు సెల్ఫీ దిగుతూ అలా
ఆత్మహత్య ఎందుకు చేసుకున్నాడన్న విషయం తెలియాల్సి వుంది.