Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్య కాపురానికి రావట్లేదని టెక్కీ సూసైడ్.. ఎక్కడ?

Webdunia
శుక్రవారం, 21 డిశెంబరు 2018 (08:58 IST)
హైదరాబాద్ నగరంలో ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్నాడు. కట్టుకున్న భార్య కాపురానికి రాకపోవడంతో మనస్తాపం చెంది ఇంట్లోనే ఫ్యానుకు ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
హైదరాబాద్, జియాగూడ క్రాంతిభవన్‌కు చెందిన జి. కమలేష్ (40), శ్రీవిద్య అనే దంపతులు ఉన్నారు. వీరికి పదేళ్ళ కుమారుడు కూడా ఉన్నాడు. కమలేష్ హైటెక్ సిటీలోని ఐబీఎం కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పని చేస్తున్నాడు. 
 
అయితే, గత మూడేళ్లుగా భార్యాభర్తల మధ్య మనస్పర్థలు తలెత్తాయి. దీంతో శ్రీవిద్య పుట్టింటికి తన కుమారుడుతో కలిసి వెళ్లిపోయింది. ఆ తర్వాత కాపురానికి రావాలంటూ కమలేష్ పలుమార్లు భార్యను కోరాడు. కానీ, ఆమెవైపు నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో మనస్తాపం చెందిన కమలేష్ తన ఇంట్లోని పడకగదిలో ఫ్యానుకు ఉరేసుకున్నాడు. 
 
గత నాలుగు రోజులుగా కమలేష్‌ ఉంటున్న ఇంటి తలుపులు తీయకపోవడం, ఇంటి ముందు నాలుగు రోజుల పేపర్లను గమనించిన స్థానికులు తలుపులను తెరిచేందుకు ప్రయత్నించారు. తలుపు గడియ వేసి ఉండటంతో గడియ పగులగొట్టి చూసే సరికి బెడ్‌ రూంలో ఫ్యాన్‌కు ఉరేసుకుని కనిపించాడు. దీంతో స్థానికులు కుల్సూంపుర పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments