తల్లిదండ్రుల కళ్ల ముందే దారుణం జరిగిపోయింది. తల్లిదండ్రులను సాగనంపేందుకు రైల్వే స్టేషన్‌కు వచ్చిన టెక్కీ ప్రాణాలు కోల్పోయాడు. కదులుతున్న రైలు నుంచి దిగే క్రమంలో టెక్కీ అదుపు తప్పి కిందపడిపోయాడు. ఈ ఘటన కర్ణాటకలో చోటుచేసుకుంది. వివరాల్లోకి కేరళలోని పాలక్కాడ్ జిల్లా కంజికోడే గ్రామానికి చెందిన విక్రమ్ విజయన్ (28) బెంగళూరులోని విప్రో కంపెనీలో టెక్కీగా పనిచేస్తున్నాడు.
ఈ నేపథ్యంలో విక్రమ్‌ను చూసేందుకు అతని తల్లిదండ్రులు బెంగళూరు వచ్చారు. కొద్ది రోజుల తర్వాత కేరళకు తిరుగు ప్రయాణం అయ్యారు. ఈ క్రమంలో కర్మేలారం రైల్వే స్టేషన్లో తల్లిదండ్రులను విక్రమ్ రైలు ఎక్కించి సాగనంపేందుకు వచ్చాడు. రైలు కదలబోతుండగా దిగేందుకు విక్రమ్ ప్రయత్నించాడు. ఈ క్రమంలో కింద పడ్డ విక్రమ్ తీవ్రంగా గాయపడి ప్రాణాలు కోల్పోయాడు.
మరోవైపు కుమారుడు పడిపోవడాన్ని గమనించిన విజయన్ తానూ రైలు దిగబోయి తీవ్రంగా గాయపడ్డాడు. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. కళ్ల ముందే పెంచి పెద్ద చేసిన కుమారుడు కోల్పోవడం ఆ దంపతులను తీవ్రంగా కలచివేసింది. రైలు నుంచి తమ బిడ్డ కిందపడిపోతుండటం చూసి ఏమీ చేయలేకపోయామని.. తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యామని వారు రోదిస్తున్నారు.