Webdunia - Bharat's app for daily news and videos

Install App

డిజిటల్ కెమెరాలు బుక్ చేస్తే... బండరాళ్లు వచ్చాయి...

Webdunia
మంగళవారం, 16 ఏప్రియల్ 2019 (15:08 IST)
ఆన్‌లైన్ షాపింగ్‌లో డిజిటల్ కెమెరాలను బుక్ చేస్తే బండరాళ్లు వచ్చాయి. దీంతో కస్టమర్ విస్తుపోయాడు. ఈ మాయాజాలం ఆన్‌లైన్ సంస్థ ఫ్లిప్‌కార్టులో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, తెలంగాణ రాష్ట్రంలోని వనపర్తి జిల్లా, భగత్‌సింగ్‌ నగర్‌ కాలనీకి చెందిన చీర్ల యాదిసాగర్‌ ఈ నెల 11వ తేదీన జీఎస్టీతో కలిపి రూ.48,990 విలువ గల కెనాన్‌ కంపెనీ డిజిటల్‌ కెమెరాను ఫ్లిప్‌కార్డు ఆన్‌లైన్‌ షాపింగ్‌లో కొనుగోలు చేశాడు. 
 
ఆన్‌లైన్‌లో బుక్ చేసిన వస్తువులు సోమవారం ఫ్లిప్‌కార్డు నుంచి ఇన్‌స్టాకార్డు సర్వీసెస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ద్వారా యాదిసాగర్‌కు ఓ పార్సిల్‌ వచ్చింది. డబ్బు చెల్లించి పార్సిల్‌ను ఇంటికి తెచ్చి తెరిచి చూస్తే.. అందులో ఉన్న రెండు బండాళ్ళను చూసి షాక్ తిన్నాడు. 
 
ఆ తర్వాత తేరుకుని కొరియర్ సంస్థను ప్రశ్నిస్తే, తమకు సంబంధం లేదని చెప్పేశాడు. దీంతో బాధితుడు రాళ్లతో వచ్చిన ఫ్లిప్‌కార్డు బాక్స్‌తో జిల్లాకేంద్రంలోని పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. కానీ పోలీసులు కూడా కేసు నమోదు చేస్తాంగానీ, చర్యలు తీసుకోలేమని, కాల్‌సెంటర్‌కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలంటూ ఉచిత సలహా ఇచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

క్షమించమని అడక్కుండా రాజకీయాలకు స్వస్తి చెప్తే సరిపోదు: పోసానిపై నిర్మాత

అతివృష్టి లేదంటే అనావృష్టి : ఈ శుక్రవారం ఏకంగా 10 చిత్రాలు విడుదల...

పుష్ప-2 ది రూల్‌ నుంచి శ్రీలీల కిస్సిక్‌ సాంగ్‌ రాబోతుంది

డిఫరెంట్ యాక్షన్ థ్రిల్లర్ కిల్లర్ నుంచి పూర్వాజ్ క్యారెక్టర్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వాయు కాలుష్యంలో హృద్రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

హెల్దీ లివర్ కోసం పాటించాల్సిన చిట్కాలు

రోజూ కొన్ని బాదంపప్పులు తీసుకోండి: నేటి వేగవంతమైన జీవనశైలిలో ఆరోగ్యానికి తోడ్పడుతుంది

రక్తవృద్ధికి తోడ్పడే ఖర్జూరాలు

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండటానికి 8 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments