Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రెండో భార్యగా ఉంటావా? ఆత్మహత్య చేసుకోమంటావా? మరదలికి బావ వేధింపులు

Advertiesment
రెండో భార్యగా ఉంటావా? ఆత్మహత్య చేసుకోమంటావా? మరదలికి బావ వేధింపులు
, మంగళవారం, 16 ఏప్రియల్ 2019 (14:29 IST)
హైదరాబాద్ నగరంలో మరదలిని వేధిస్తున్న బావను పోలీసులు చుక్కలు చూపించారు. కేసు పెట్టి జైలు ఊచలు లెక్కించేలా చేశారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, హైదరాబాద్‌లోని ముషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గాంధీనగర్‌‌కు చెందిన జాకబ్ కొనికి (40) అనే వ్యక్తి ఓ ప్రైవేటు కంపెనీలో పని చేస్తున్నాడు. ఈయనకు వివాహమై ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. 
 
ఈయనకు తన మేనకోడలిపై కన్నుపడింది. ఈమె తండ్రి చనిపోవడంతో కుటుంబ బాధ్యతలు నిర్వహిస్తూ వస్తోంది. 30 యేళ్ళ వయస్సున్న ఈమెపై కొనికి కన్నుపడింది. పైగా, కుటుంబ బాధ్యతల కారణంగా పెళ్లి చేసుకోలేదు. దీన్ని అలుసుగా తీసుకున్న జాకబ్ ఆమెను తీవ్రంగా వేధిస్తూ వచ్చాడు. 
 
ఈ క్రమంలో తనను పెళ్లి చేసుకుని రెండో భార్యగా ఉండాలని వేధించసాగాడు. అయినా ఆమె మాత్రం అతని హింసలను భరిస్తూ వచ్చింది. ఇటీవల మరింత ముందుకెళ్లి తనను పెళ్లాడకుంటే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించసాగాడు. అతడి మిత్రులైన మెజెస్‌, సోను, సాయికుమార్‌‌లు కూడా అతడికి వత్తాసు పలికారు.
 
వీరంతా కలిసి ఆమెపై ఒత్తిడి చేయసాగారు. ఆదివారం మరోమారు ఫోన్ చేసి తనను పెళ్లి చేసుకోవాలని బెదిరిస్తూ అసభ్యకరంగా మాట్లాడాడు. ఇలా రోజురోజుకూ వారి ఆగడాలు పెచ్చుమీరుతుండటంతో ఇక లాభం లేదని భావించిన ఆమె.. పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు.. జాకబ్‌ను అరెస్టు చేసి కటకటాల వెనక్కి పంపించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఒకే ఒక అక్షరంతో ప్రపంచ రికార్డును కోల్పోయిన చెన్నై సెంట్రల్