Webdunia - Bharat's app for daily news and videos

Install App

కుటుంబ సభ్యులకు సరైన గౌరవం ఇవ్వలేదనీ భార్య - పిల్లలను హత్య చేసిన భర్త

తన కుటుంబ సభ్యులకు సరైన గౌరవం ఇవ్వలేదన్న అక్కసుతో భార్యను హతమార్చాడో కసాయి. ఆ తర్వాత తాను జైలుకెళ్తే తన పిల్లలు అనాథలైపోతారని భావించి వారిని కూడా చంపేసినట్టు ఓ కిరాతకుడు చెప్పాడు.

Webdunia
గురువారం, 22 మార్చి 2018 (11:21 IST)
తన కుటుంబ సభ్యులకు సరైన గౌరవం ఇవ్వలేదన్న అక్కసుతో భార్యను హతమార్చాడో కసాయి. ఆ తర్వాత తాను జైలుకెళ్తే తన పిల్లలు అనాథలైపోతారని భావించి వారిని కూడా చంపేసినట్టు ఓ కిరాతకుడు చెప్పాడు. మీర్‌పేట ఠాణా పరిధి బడంగ్‌పేటలో వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, రాజేంద్రనగర్‌ మండలం కాటేదాన్‌ పద్మశాలిపురానికి చెందిన సంగిశెట్టి సురేందర్‌(32) తెల్లాపూర్‌లోని కొమరంభీం కాలనీలో నివసిస్తున్నాడు. వృత్తిరీత్యా లింగంపల్లిలో శ్రీలక్ష్మీ ఆటో ఇంజినీరింగ్‌ వర్క్స్‌‌లో పని చేస్తున్నాడు. ఈయనకు భార్య వరలక్ష్మి, పిల్లలు అయిదేళ్ల రితేష్‌, మూడేళ్ల యశస్విని ఉన్నారు. 
 
అయితే, కుటుంబ కలహాలతో దంపతులు తరచూ గొడవపడేవారు. తన తల్లిదండ్రులను, సోదరిలను భార్య సరిగా చూసుకోవడంలేదని.. వారితో చక్కగా ప్రవర్తించేది కాదని సురేందర్‌ విభేదించేవాడు. ఉగాదికి రావాలంటూ అత్తవారు బడంగ్‌పేటకు ఆహ్వానించగా సురేందర్‌ భార్యాపిల్లలతో సోమవారం వెళ్లాడు. ఇంటికి వెళ్లిపోదామని.. అన్నయ్య వద్ద ఉన్న తన తల్లి వస్తుందని సురేందర్‌ మంగళవారం తెల్లవారుజామున వరలక్ష్మికి చెప్పగా వచ్చేందుకు నిరాకరించింది. 
 
ఇంటికి రావొద్దన్నా అత్త ఎందుకు వస్తోందంటూ నిలదీసింది. తీవ్ర ఆగ్రహానికి లోనైన సురేందర్‌ పథకం పన్నాడు. మామ, బావమరిదిని కల్లు తేవాలంటూ బయటకు పంపించాడు. అత్త వంటగదిలో ఉండగా... బెడ్‌రూంలో ఉన్న భార్యను, కుమార్తెను గొంతునులిమి హత్యచేశాడు. బయట ఆడుకుంటున్న కుమారుడిని చరవాణిలో గేమ్‌ డౌన్‌లోడ్‌ చేస్తున్నానని పిలిచి.. హత్యచేసి కారులో పరారై వీఆర్వో వద్ద లొంగిపోయాడు. దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి సురేందర్‌ను అరెస్టు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఉజ్జయిని మహాకాళేశ్వర్ టెంపుల్ సాక్షిగా కన్నప్ప రిలీజ్ డేట్ ప్రకటన

వెన్నెల కిషోర్ నటించిన శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ రిలీజ్ డేట్ ఫిక్స్

బహుముఖ ప్రజ్నాశాలి శ్వేతప్రసాద్ కు బిస్మిలా ఖాన్ అవార్డు

సెల్ ఫోన్లు రెండూ ఇంట్లో వదిలేసి రాంగోపాల్ వర్మ పరార్? ఇంటి ముందు పోలీసులు

ఆ ఫ్యామిలీస్ కీ వేరే లెవెల్ ఆఫీస్ వెబ్ సిరీస్ కనెక్ట్ అవుతుంది : డైరెక్టర్ ఇ సత్తిబాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments