Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ మూడు జిల్లాల్లోని పాఠశాలలకు 2 రోజుల సెలవు

Webdunia
శుక్రవారం, 3 డిశెంబరు 2021 (10:49 IST)
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీవ్ర తుఫానుగా మారనుంది. ప్రస్తుతం ఇది విశాఖపట్టణానికి ఆగ్నేయంగా 900 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది శనివారానికి ఆంధ్ర - ఒడిషా రాష్ట్రాల మధ్య తీరం దాటొచ్చని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ కారణంగా ఏపీలోని విశాఖపట్టణం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఈ తుఫానుకు జవాద్ అనే పేరు పెట్టారు. ఇది పెను విపత్తను సృష్టించవచ్చని హెచ్చరికలు చేస్తున్నారు. దీంతో ఏపీ ప్రభుత్వం అప్రమైంది. ఆ మూడు జిల్లాల్లో స్కూల్స్‌కు శుక్రవారం, శనివారాల్లో సెలవులు ప్రటించారు. 
 
ఇదిలావుంటే, బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం కాస్త వాయుగుండంగా మారిందని, ఇది విశాఖపట్టణంకు ఆగ్నేయంగా 960 కిలోమీటర్ల దూరంలో ఉందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ వాయుగుండం వాయువ్య దిశగా పయనించి వచ్చే 24 గంటల్లో తుఫానుగా మారుతుందని ఐఎండీ వెల్లడించింది. 
 
అయితే, వాయుగుండం తుఫానుగా మారితే దీనికి జవాద్ అనే పేరును ఖరారు చేయనున్నారు. అదేసమయంలో ఈ తుఫాను ఈ నెల 4వ తేదీ శనివారం ఉత్తరాంధ్ర, దక్షిణ ఒరిస్కా మధ్య తీరం దాటొచ్చని అంచని ఓ ప్రైవేటు వాతావరణ కేంద్రం అంచనా వేసింది. 
 
ఈ కారణంగా ఉత్తర కోస్తా, ఒరిస్సా తీర ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురవవచ్చని వాతావరణ శాఖ హెచ్చరించింది. ముఖ్యంగా, ఏపీలోని విశాఖపట్టణం, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు పేర్కొంది. దీంతో ఏపీ ప్రభుత్వం అప్రమత్తమై ఆ మూడు జిల్లాలకు ప్రత్యేక అధికారును కూడా నియమించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అరుణాచలంలో ఆ హీరో - హీరోయిన్ చేసిన పనికి మండిపడుతున్న భక్తులు!!

టాలీవుడ్‌లో విషాదం : నిర్మాత ముళ్లపూడి బ్రహ్మానందం కన్నుమూత

ఆదిత్య 369 రీ-రిలీజ్... ఏప్రిల్ 4న విడుదల.. ట్రైలర్ అదుర్స్

VV Vinayak: వినాయక్ క్లాప్ తో ప్రారంభమైన ఎం ఎస్ ఆర్ క్రియేషన్స్ చిత్రం

లగ్గం టైమ్‌ షూటింగ్ పూర్తి, సమ్మర్ కానుకగా విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

తర్వాతి కథనం
Show comments