Webdunia - Bharat's app for daily news and videos

Install App

హైస్కూలు ఏర్పాటు చేసినంత‌ ఈజీ కాదు, హైకోర్టు ఏర్పాటు

Webdunia
శుక్రవారం, 8 అక్టోబరు 2021 (15:58 IST)
క‌ర్నూలును న్యాయ రాజ‌ధాని చేస్తామ‌ని ఏపీ సీఎం జ‌గ‌న్ చెపుతున్నమాట‌లు కార్య‌రూపం దాల్చ‌డం క‌ల్ల అని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ప్రత్యేక ఆహ్వానితుడు డాక్ట‌ర్ చింతా మోహ‌న్ చెప్పారు. 1985 నుంచి జుడీషియల్ వ్యవస్థ గురించి త‌న‌కు బాగా తెలుసున‌ని, హైస్కూలు మంజూరు చేసినంత ఈజీ కాదు, హైకోర్టు మంజూరు చేయడం అని స్ప‌ష్టం చేశారు. 
 
కర్నూలును న్యాయ రాజధాని చేయడం రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో లేద‌ని, రాష్ట్ర హైకోర్టు ఎక్కడ ఉండాలన్నది సుప్రీం కోర్టు కొలీజియం కమిటీ,  రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తులు సమిష్టిగా, కలిసి నిర్ణయించాల్సిన అంశం అని చింతా మోహ‌న్ చెప్పారు. జుడీషియల్ అంశంపై ఎగ్జిక్యూటివ్ జోక్యం తగద‌న్నారు. ఏపీలో బుగ్గన రాజేంద్రనాద్ రెడ్డి ఆర్థిక శాఖ మంత్రి కాద‌ని, ఆయ‌న అప్పుల శాఖ మంత్రి అని చెప్పారు. నిర్మలా సీతారామన్ ని చూసేదానికి, వారానికి రెండుసార్లు డిల్లీ పర్యటన చేస్తున్నార‌ని ఎద్దేవా చేశారు. గతంలో ఇందిరా గాంధీని కలిసేదానికి కర్నూల్ నుంచి కొందరు నాయకులు తరచుగా  డిల్లీ వెళ్లేవాళ్లని, ఇప్పుడు బుగ్గన రాజేంద్రనాద్ రెడ్డి  అప్పుల కోసం డిల్లీ వీధుల్లో  తిప్పలు పడుతున్నార‌ని చెప్పారు.  
 
 
తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి లడ్డూలను, డిల్లీలో కేంద్ర నాయకులను కలిసిన సందర్భంగా వారిని ప్రసన్నం చేసుకునేందుకు పంచుతున్నార‌ని ఎద్దేవా చేశారు. దళితుల ఓట్లతో అధికారంలోకి వచ్చిన వైసిపి ప్రభుత్వం దళితులకు ద్రోహం చేసింద‌ని, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు, రిటైర్డ్ ఉద్యోగులకు నెల నెలా  సక్రమంగా  జీతాలు,పెన్షన్ ఇవ్వలేని దుస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉంద‌న్నారు. 

 
గుజరాత్ రాష్ట్రం నుండి వేల కోట్ల రూపాయలు  విలువ చేసే డ్రగ్స్ మన దేశంలోకి వస్తున్నాయని, డ్రగ్స్ సరఫరా కేంద్రంగా గుజరాత్ సరికొత్త చరిత్ర సృష్టించింద‌ని చింతా మోహ‌న్ చెప్పారు. డ్రగ్స్ మాఫియా అసలు  దుర్మార్గులను దాచిపెట్టి,  సినిమా యాక్టర్లను తెర ముందుకు తెచ్చి,  విచారణ పేరుతో హడావిడి చేస్తున్నార‌ని ఆరోపించారు.  కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 75 శాతం నిధులను, జగన్ ప్రభుత్వం పక్కదారి పట్టిస్తున్నద‌ని, 2024 ఎన్నికల్లో కేంద్రంలో,  రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంద‌ని చింతా మోహ‌న్ జోస్యం చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vishal: పందెం కోడి హీరో విశాల్ పెళ్లి వాయిదా పడిందా? కారణం ఏంటంటే?

అమ్మాయి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం రిలీజ్‌కు ఎన్ని కష్టాలు : అనుపమ పరమేశ్వరన్

పరదా లాంటి సినిమా తీయడం అంత ఈజీ కాదు : డి. సురేష్ బాబు

Prabhas: కట్టప్ప బాహుబలిని చంపకపోతే? ఎవరు చంపేవారో తెలుసా !

Nidhi: వంద సినిమాలు చేసినా, పవన్ కళ్యాణ్ తో ఒక్క సినిమా ఒకటే : నిధి అగర్వాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

తర్వాతి కథనం
Show comments