Webdunia - Bharat's app for daily news and videos

Install App

అనుభవించు రాజా.. పాటలు పెట్టుకుని ఆంటీని లాడ్జికి పిలిచి..ఆ తరువాత..?

Webdunia
శుక్రవారం, 8 అక్టోబరు 2021 (15:50 IST)
తిరుచానూరు ఆలయానికి సమీపంలో లాడ్జి తీసుకున్నాడు. ఆంటీకి ఫోన్ చేశాడు. గదిలోకి వెళ్ళి షర్టు గుండీలు విప్పాడు. అనుభవించు రాజా అంటూ పాటలు పెట్టాడు. ఇంకాసేపట్లో ఆంటీ వస్తుంది ఎంజాయ్ చేద్దామనుకున్నాడు. అంతే ఇంతలో ఆంటీతో పాటు ప్రజా సంఘాలు వచ్చాయి. అంకుల్‌కి బడిత పూజ చేశాయి. ఇదంతా ఎక్కడ జరిగిందంటే..
 
తిరుపతిలోని రైల్వేస్టేషన్లో సూపర్ వైజర్‌గా పనిచేస్తున్నాడు దొరై. అక్కడ పనిచేస్తున్న కాంట్రాక్ట్ మహిళా ఉద్యోగినులకు డ్యూటీలు వేసేది ఇతనే. ఎక్కువ డ్యూటీలు కావాలంటే మనోడు చెప్పింది వినాలి. అతను పిలిచినప్పుడు కోరిక తీర్చాలి. ఇలా 20 మందికిపైగా మహిళల జీవితాలతో ఆడుకున్నాడు. వారిని అనుభవించాడు.
 
ఇంకా చాలామందిని లైన్లో పెట్టాడు. బెదిరించాడు. ఆర్ధికంగా ఇబ్బంది పడుతున్న వారినే టార్గెట్ చేశాడు. మీకు డ్యూటీలు లేకుంటే పస్తులు ఉండాలి..అన్నం కూడా ఉండదంటూ మానసికంగా ఇబ్బందులకు గురిచేశాడు. తాను చెప్పిన ప్లేస్‌కు వచ్చి కోర్కె తీరిస్తే చాలన్నాడు. 
 
ఇలా దొరై వేధింపులను తట్టుకోలేని ఒక మహిళ, మహిళా సంఘాలను ఆశ్రయించింది. ఎలాంటి అనుమానం లేకుండా ఆ కామాంధుడి గదికి వెళ్ళాలంటూ చెప్పారు మహిళా సంఘాలు. తిరుచానూరు అమ్మవారి ఆలయానికి పక్కనే ఉన్న ఒక లాడ్జిని అద్దెకు తీసుకున్నాడు దొరై. 
 
మహిళకు ఫోన్ చేశాడు. సెల్ ఫోన్లో పాటలు పెట్టి కూర్చున్నాడు. అంతే ఆంటీ గదికి వెళ్ళింది. ఇక ఎంజాయ్ చేయడమే ఆలస్యమనుకున్నాడు. షర్ట్ గుండీలు తీయడం మొదలుపెట్టాడు. వెనుకనే మహిళా సంఘాలు వచ్చాయి. దీంతో బాధిత మహిళ తన కాలి చెప్పును తీసింది. దొరైను చితకబాదింది.
 
మహిళా సంఘాలు కూడా కామాంధుడికి దేహశుద్ధి చేశారు. తిరుచానూరు పోలీసులకు సమాచారమిచ్చారు. తిరుచానూరు పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. మరో మహిళకు అన్యాయం జరగకుండా పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

ఫిలింఛాబర్ వర్సెస్ ఎగ్జిబిటర్లు - థియేటర్ల మూసివేతపై ఎవరిదారి వారిదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments