Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా అషానుద్దీన్

Advertiesment
ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా అషానుద్దీన్
, మంగళవారం, 5 అక్టోబరు 2021 (22:43 IST)
ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ అషానుద్దీన్ అమానుల్లా నియమితులయ్యారు. ఈయన ప్రస్తుతం పాట్నా హైకోర్టులో పని చేస్తున్నారు. సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు మేరకు దేశ వ్యాప్తంగా 15 హైకోర్టుల న్యాయమూర్తులను బదిలీ చేస్తూ కేంద్రం మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది. 
 
అలాగే, తెలంగాణ హైకోర్టు న్యాయ‌మూర్తిగా ప్ర‌స్తుతం బాంబే హైకోర్టులో ప‌ని చేస్తున్న‌ జ‌స్టిస్ ఉజ్జ‌ల్ భూయాన్‌ను నియ‌మించింది. ఇప్ప‌టివ‌ర‌కు తెలంగాణ హైకోర్టు న్యాయ‌మూర్తిగా ఉన్న జ‌స్టిస్ ఎంఎస్ఎస్‌ రామ‌చంద్ర‌రావును పంజాబ్ అండ్ హ‌ర్యానా హైకోర్టు న్యాయ‌మూర్తిగా బ‌దిలీ చేసింది. వీరితోపాటు తెలంగాణ‌, ఏపీ హైకోర్టుల‌కు న్యాయ‌మూర్తుల‌ను నియ‌మించింది.
 
పంజాబ్ అండ్ హ‌ర్యానా హైకోర్టు న్యాయ‌మూర్తిగా ఉన్న జ‌స్టిస్‌ జ‌స్వంత్ సింగ్‌ను ఒడిశాకు బ‌దిలీ చేసింది. రాజ‌స్థాన్ హైకోర్టు న్యాయ‌మూర్తి జ‌స్టిస్ స‌బీనాను హిమాచ‌ల్‌ప్ర‌దేశ్‌కు బదిలీ చేసింది. ఒడిశా హైకోర్టు న్యాయ‌మూర్తిగా ఉన్న జ‌స్టిస్‌ సంజ‌య కుమార్ మిశ్రా.. ఉత్త‌రాఖండ్‌కు బ‌దిలీ అయ్యారు. జ‌స్టిస్ ఎంఎం శ్రీవాత్స‌వ ప్ర‌స్తుతం ప‌ని చేస్తున్న ఛ‌త్తీస్‌గ‌ఢ్ హైకోర్టు నుంచి రాజ‌స్థాన్‌కు బదిలీ అయ్యారు. 
 
గుజ‌రాత్ నుంచి ప‌రేశ్ ఆర్ ఉపాధ్యాయ‌ను మ‌ద్రాస్ హైకోర్టుకు, క‌ల‌క‌త్తా హైకోర్టు న్యాయ‌మూర్తి జ‌స్టిస్ అరిందం సిన్హాను ఒడిశాకు, కేర‌ళ హైకోర్టు న్యాయ‌మూర్తి జ‌స్టిస్ ఏఎం బాద‌ర్‌ను పాట్నాకు బ‌దిలీ చేశారు. 
 
అల‌హాబాద్ హైకోర్టు న్యాయ‌మూర్తి జ‌స్టిస్ య‌శ్వంత్ వ‌ర్మ‌ను ఢిల్లీ హైకోర్టుకు, అల‌హాబాద్ హైకోర్టు నుంచి వివేక్ అగ‌ర్వాల్‌ను మ‌ధ్య‌ప్ర‌దేశ్‌కు, జ‌స్టిస్‌ చంద్ర‌ధారి సింగ్‌ను అల‌హాబాద్ నుంచి ఢిల్లీకి బ‌దిలీ చేశారు.
 
హిమాచ‌ల్ ప్ర‌దేశ్ నుంచి జ‌స్టిస్ అనూప్ చిత్కారాను పంజాబ్ అండ్ హ‌ర్యానా హైకోర్టుకు బ‌దిలీ చేశారు. ఇక అల‌హాబాద్ హైకోర్టులో ప‌ని చేస్తున్న ర‌వినాథ్ తిల్హ‌రిని ఆంధ్ర‌ప్ర‌దేశ్ హైకోర్టుకు స్థానచలనం కల్పించారు. 
 
ఇటీవల సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సుల మేరకు కేంద్రం ఈ బదిలీలు చేసింది. ఈ మేరకు మంగళవారం కేంద్ర న్యాయ శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఈ న్యాయమూర్తుల బదిలీకి రాష్ట్రపతి కూడా ఆమోదముద్రవేశారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

స్పేస్‌లో ఫస్ట్ టైమ్ మూవీ షూట్ .. అంతరిక్షంలోకెళ్లిన రష్యా నటి - డైరెక్టర్