రాష్ట్రవ్యాప్తంగా జరిగిన బదిలీల్లో భాగంగా గుంటూరు జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా ఏ.వి. రవీంద్రబాబును నియమిస్తూ రాష్ట్ర హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. రవీంద్ర బాబు చిత్తూరు జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా పని చేస్తూ, ఇక్కడకు బదిలీపై రానున్నారు. ఈ బదిలీల్లో గుంటూరు జిల్లాలో ఖాళీగా ఉన్న అయిదు జిల్లాస్థాయి కోర్టులకు న్యాయమూర్తులు నియమితులయ్యారు.
చిత్తూరు జిల్లాలో సీనియర్ సివిల్ జడ్జిగా పనిచేస్తున్న ఆర్.శ్రీలతను పదోన్నతి పై గుంటూరు ఐదవ అదనపు జిల్లా మహిళా కోర్ట్ న్యాయమూర్తిగా నియమించారు. అంతేకాకుండా ఇప్పటివరకు ఒకటవ అదనపు జిల్లా కోర్టు న్యాయమూర్తి విచారిస్తున్న ఫోక్సో కేసులు కూడా ఆమె విచారించేలా పూర్తి అదనపు బాధ్యతలను అప్పగించారు.
గుంటూరు మూడో అదనపు జిల్లా కోర్టు న్యాయమూర్తిగా విశాఖపట్నం జువైనల్ కోర్టు న్యాయమూర్తిగా పనిచేస్తున్న జి.అర్చనను నియమించారు. గుంటూరు ఫ్యామిలీ కోర్టు న్యాయమూర్తిగా చిత్తూరులో అదనపు జిల్లా కోర్టు న్యాయమూర్తిగా పనిచేస్తున్న పివీఎస్. సూర్యనారాయణ మూర్తిని నియమించారు. కర్నూలు జిల్లా ఆదోని సీనియర్ సివిల్ జడ్జి ఎం.ఎ.సోమశేఖర్ ను గురజాల అదనపు జిల్లా జడ్జిగా పదోన్నతిపై నియమిస్తూ రాష్ట్ర హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.