కరోనా కల్లోలం... గన్నవరం ఎయిర్ పోర్టు అప్రమత్తం

Webdunia
శుక్రవారం, 20 మార్చి 2020 (13:59 IST)
ఏపీలో కరోనా వైరస్ కలకలంరేపుతోంది. దీంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తమైంది. రాష్ట్రంలో ఎన్నికలు రద్దయ్యాయి. విద్యాసంస్థలు, వివిధ రంగానికి చెందిన సంస్థలు మూసివేశారు. గన్నవరం విమానాశ్రంలో కూడా తగు జాగ్రత్తలు తీసుకున్నారు. ఈ సందర్భంగా గన్నవరం ఎయిర్‌పోర్టు డైరక్టర్ మధుసూదన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ కరోనా వైరస్ నేపథ్యంలో 45 రోజుల నుంచి జాగ్రత్తలు తీసుకున్నామని చెప్పారు. హెల్త్ క్యాంప్ నిర్వహిస్తున్నామని తెలిపారు. వచ్చే ప్రయాణీకులందరికీ వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు.
 
కాగా కరోనా ఎఫెక్ట్‌తో విజయవాడ విమానాశ్రయం వెలవెలబోయింది. వారం రోజులుగా సగటున 500కు పైగా ప్రయాణికుల సంఖ్య తగ్గిపోతున్నట్టు విమానాశ్రయ ఉన్నతాధికారులు తెలిపారు. హైదరాబాద్‌కు నడిచే విమాన సర్వీసును ట్రూజెట్‌ ఎయిర్‌లైన్స్‌ ఏప్రిల్‌ 20 వరకు రద్దు చేసింది. ఇటీవలే ట్రూజెట్‌ సంస్థ హైదరాబాద్‌కు రూ.1,100 చార్జీ నిర్ణయించింది. అయినా ఆదరణ లేక తాత్కాలికంగా రద్దు చేయాలని నిర్ణయించింది. బెంగళూరుకు వెళ్లే విమాన సర్వీసును స్పైస్‌జెట్‌ సంస్థ రద్దు చేసింది. ఇండిగో, ఎయిరిండియా సంస్థలు సర్వీసుల కుదింపునకు సన్నాహాలు చేస్తున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మరో 100 జన్మలైనా.. రజనీకాంత్‌లాగే పుట్టాలనుకుంటున్నా... తలైవర్ భావోద్వేగం

Akhil Raj: అఖిల్ రాజ్ హీరోగా సతీష్ గోగాడ దర్శకత్వంలో అర్జునుడి గీతోపదేశం

Raashi Singh: త్రీ రోజెస్ సీజన్ 2 నుంచి లైఫ్ ఈజ్ ఎ గేమ్.. లిరికల్ సాంగ్

Suresh Babu: ఎమోసనల్‌ డ్రామా పతంగ్‌ చిత్రం : సురేష్‌బాబు

Anita Chowdhury: అంబాసిడర్ కారులో పదిమంది కుక్కేవారు : అనితా చౌదరి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Ginger Pachhadi: శీతాకాలం.. అల్లం పచ్చడితో ఆరోగ్యానికి ఎంత మేలో తెలుసా?

జుట్టుకు మేలు చేసే ఉల్లిపాయ నూనె.. మసాజ్ చేస్తే అవన్నీ పరార్

శీతాకాలంలో లవంగం దగ్గర పెట్టుకోండి, బాగా పనికొస్తుంది

winter tips, వెల్లుల్లిని ఇలా చేసి తింటే?

కాలిఫోర్నియా బాదంతో రెండు సూపర్‌ఫుడ్ రెసిపీలతో శీతాకాలపు ఆరోగ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments