Webdunia - Bharat's app for daily news and videos

Install App

సిరినగరిలో హైటెక్ వ్యభిచారం... విటులకు వాట్సప్‌లో వల

కడప జిల్లాలోని ప్రొద్దుటూరు, సిరినగరిలో హైటెక్ వ్యభిచారం జోరుగా సాగుతోంది. ఇక్కడకు విటులను రప్పించేందుకు వాట్సాప్‌ సందేశాల ద్వారా గాలం వేస్తున్నారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే,

Webdunia
శనివారం, 23 జూన్ 2018 (17:12 IST)
కడప జిల్లాలోని ప్రొద్దుటూరు, సిరినగరిలో హైటెక్ వ్యభిచారం జోరుగా సాగుతోంది. ఇక్కడకు విటులను రప్పించేందుకు వాట్సాప్‌ సందేశాల ద్వారా గాలం వేస్తున్నారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే...
 
రాయలసీమలోనే ప్రముఖ వ్యాపారకేంద్రమైన ప్రొద్దుటూరు పట్టణం సిరినగరిలో హైటెక్‌ పద్ధతిలో జోరుగా వ్యభిచారం సాగుతోంది. విలాసవంతమైన ప్రాంతాలను టార్గెట్‌ చేసుకుని, కొందరు అక్కడ భవంతులను, సాధారణ గృహాలను, అపార్టుమెంట్లలో ఫ్లాట్లను అద్దెకు తీసుకుని వ్యభిచార దందాను గుట్టుచప్పుడు కానివ్వకుండా కొనసాగిస్తున్నారు. 
 
ఇందుకోసం అమ్మాయిలను ఇతర ప్రాంతాల నుంచి తీసుకొస్తున్నారు. వ్యభిచారగృహ నిర్వాహకులు మధ్యవర్తుల ద్వారా విచ్చలవిడిగా విటులను రప్పిస్తూ, అమ్మాయిల జీవితాలతో ఆడుకుంటున్నారు. విలాసవంతమైన జీవితం కోరుకునే యువతులను నిర్వాహకులు ట్రాప్‌ చేసి, మాయమాటలతో ప్రలోభపెట్టి వారి చేత వ్యభిచారం చేయించడం చేస్తున్నారు. అయితే, ఈ వ్యభిచార గృహాల నిర్వహణకు పోలీసులు కూడా తమవంతు సహకారం అందిస్తున్నట్టు సమాచారం. 
 
దీంతో పగటి పూట వ్యభిచారానికే నిర్వాహకులు ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలుస్తోంది. పోలీసుల దాడుల నేపధ్యంలో ఎవరికి ఎలాంటి అనుమానం రాకుండా హైటెక్‌ రీతిలో యువకులకు వాట్సప్‌ల ద్వారా యువతుల ఫొటోలను పంపి, ఆపై వారు కోరిన విధంగా కోరుకున్న చోటికి అమ్మాయిలను పంపిస్తున్నారు. లేకుంటే... తాము బాడుగకు తీసుకున్న ఇళ్లకు పిలిపించి, అక్కడే వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు సమాచారం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

డల్ గా వుంటే మ్యాడ్ లాంటి సినిమా చూడమని డాక్టర్లు కూడా చెప్పాలి : నాగచైతన్య

నరేష్ అగస్త్య కొత్త చిత్రం మేఘాలు చెప్పిన ప్రేమ కథ

స్క్రిప్ట్, దర్శకుడి ని బట్టి సినిమాలు అంగీకరిస్తున్నా : కామాక్షి భాస్కర్ల

హీరోయిన్ రష్మిక మందన్నా ఆస్తుల విలువ ఎంతో తెలుసా?

విక్రమ్ కొత్త చిత్రం విడుదలకు ఉన్న చిక్కులేంటి?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

Jaggery Tea : మధుమేహ వ్యాధిగ్రస్తులు బెల్లం టీ తాగవచ్చా?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

Coconut Oil: మహిళలూ రాత్రిపూట కొబ్బరినూనెను ముఖానికి రాసుకుంటే?

తర్వాతి కథనం
Show comments